Balakrishna : ఆ స్టార్ ద‌ర్శ‌కుడితో..

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే టాలీవుడ్ అగ్ర‌ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన‌టువంటి బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘అఖండ’ సినిమా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో బాల‌య్య ద్విపాత్రల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. అఖండ త‌రువాత గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఫైట్ సీన్ కూడా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్ ప్రేక్ష‌కులను విప‌రీతంగా ఆక‌ట్టుకుందనే చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ క్లైమాక్స్ వ‌ర‌కు వ‌చ్చేసింద‌ట‌. ఈ చిత్రం త‌రువాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సిన‌మా చేయ‌నున్నారు బాల‌య్య‌. ఆ సినిమా త‌రువాత బాల‌య్య మ‌రో టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని స‌మాచారం.

ఆ ద‌ర్శ‌కుడు మ‌రెవ్వ‌రో కాదు బాబీ.  ప్ర‌స్తుతం  మెగాస్టార్ చిరంజీవితో బాబీ  154వ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. చిరంజీవి సినిమా త‌రువాత బాల‌కృష్ణ సినిమా చేస్తున్నాడ‌ట బాబీ. ఇప్ప‌టికే బాల‌య్య‌కు ఓ లైన్ క‌థ విపిపించాడ‌ట‌. అది న‌చ్చ‌డంతో బాల‌య్య కూడా ఒకే చెప్పిన‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఇది వ‌ర‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ తో జై ల‌వ‌కుశ సినిమా చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు బాల‌య్య‌తో బాబీ సినిమా అంటూ వార్త‌లు వినిపించ‌డంతో నంద‌మూరి అభిమానుల్లో ఎంతో ఆస‌క్తి నెల‌కొంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు