Allu Sirish : బాలయ్యకు పాదాభివందనం

అల్లు అరవింద్ వారసుడిగా గౌరవం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. మొదటి సినిమాతో కమర్షియల్ ఫైట్స్, పాటలు అని కాకుండా ఒక మంచి సందేశాత్మక చిత్రాన్ని చేసాడు అని పలువురి సినీ ప్రముఖులు ప్రశంసలతో పాటు, మంచి గౌరవాన్ని సాధించాడు. ‘కొత్త జంట’ సినిమాతో యూత్ దగ్గరై, శ్రీరస్తు శుభమస్తు సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యాడు.

తరువాత విభిన్నమైన చిత్రాలను చేస్తూ జనాదరణ పొందుకున్నాడు శిరీష్. రెండేళ్లు గ్యాప్ తరువాత శిరీష్ నుంచి వస్తున్న చిత్రం “ఊర్వశివో రాక్షసివో” ఈ చిత్రంలో శిరీష్ సరసన అను ఇమ్మాన్యూల్ నటిస్తుంది. విజేత ఫేమ్ దర్శకుడు రాకేష్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నవంబర్ 4న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ తరుణంలో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.ఈ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేసారు.

ముఖ్య అతిధిగా పాల్గొన్న బాలకృష్ణ గారు దగ్గర అల్లు శిరీష్ ఎంతో అనుకువతో, సంస్కారంతో ప్రవర్తించాడు. ప్రతిసారి బాలయ్య గారు బాలయ్య గారు అంటూ బాలకృష్ణ గారి సినిమాల్లోని డైలాగ్స్ చెబుతూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. కేవలం డైలాగ్స్ చెప్పడమే కాకుండా చాలా పద్దతిగా సరదాగా బాలకృష్ణ గారిని ప్రశ్నలు అడుగుతూ మురిసిపోయాడు అల్లు శిరీష్. అలానే ఆయన గురించి మాట్లాడుతూ బాలయ్య బాబు గారి ఏజ్ నాకు తెలియదు కానీ ఆయన ఎనర్జీ మాత్రం పాతికేళ్ల కుర్రాడిలా ఉంటారంటూ, తాను రియల్ గా బాలయ్యను చూసిన కొన్ని సందర్భాలను ఆన్ స్టేజ్ లో పంచుకున్నారు.

- Advertisement -

అంతేకాకుండా శిరీష్ బాలయ్య కాళ్లకు నమస్కరిస్తూ, ఆశీర్వాదం తీసుకుంటూ, భుజం మీద చేయివేయించుకుని మరి ఫోటో దిగాడు. మామూలుగా సినిమా హీరోలపై అభిమానులు ప్రేమ, గౌరవం చూపించడం సాధారణం. ఒక సినిమా హీరో అయి ఉండి, తనకంటూ ఒక గుర్తింపు సాధించుకుని కూడా అంత సంస్కారంతో మెలగడం అల్లు వారబ్బాయి శిరీష్ సంస్కారం అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు