Balayya:ఒక కాంబినేషన్ నలుగురు వెయిటింగ్

టాలీవుడ్‌లో హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎంత సూపర్‌ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో బాలయ్యకు మంచి సక్సెస్ అందించిన బోయపాటి శ్రీను, ఆ తర్వాత కూడా ‘లెజెండ్’ మూవీతో మరో బ్లాక్‌ బాస్టర్‌ను అందించాడు. ఈ సినిమా సింహాకు మించిన సక్సెస్‌ను సాధించింది.రీసెంట్ గా లెజెండ్ ను మించిన హిట్ సినిమాను అఖండ తో అందించాడు బోయపాటి.

భద్ర సినిమాతో దర్శకుడిగా మొదలైన బోయపాటి శ్రీను ప్రయాణం సింహ సినిమాతో ఊహించని మలుపు తిరిగింది,నందమూరి నటసింహ బాలకృష్ణ కు రాసిన డైలాగ్స్ కు థియేటర్ దద్దరిల్లింది.
ఆ తరువాత ఎన్టీఆర్ దమ్ము సినిమాపై ఆడియన్స్ కు ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి,దానికి తోడు స్టేజి పైన ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్,మాటలకు ఆడియన్స్ లో కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది.
కానీ సినిమా నిరాశకు గురి చేసింది.

దమ్ము సినిమా తరువాత వచ్చిన లెజెండ్ సినిమా అటు బాలయ్య కెరియర్ కు ఇటు బోయపాటి కెరియర్ కు పెద్ద ప్లస్ అయింది.
ఇక అఖండ రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బాక్స్ లు బద్దలయ్యాయి కొన్ని చోట్ల. ఇప్పుడు మళ్ళీ బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో సినిమా కోసం ఏకంగా నాలుగు ప్రొడక్షన్ హౌస్ లు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

వీటిలో సితార ఎంటర్టైన్మెంట్స్ , 14 రీల్స్ , ద్వారకా క్రియేషన్స్ , అలానే ఇప్పటివరకు ప్రొడ్యూసర్ గా హిట్ చూడని నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా ఈ కాంబినేషన్ కోసం ట్రై చేస్తున్నట్లు వినికిడి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు