Balayya: తారకరత్న పేరు చరిత్రలో నిలిచిపోయేలా మాస్టర్ ప్లాన్..

నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సందర్భంగా తారకరత్న కూడా పాల్గొన్నాడు. ఈ పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు వచ్చింది. దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారక రత్న ఫిబ్రవరి 22న ఈ తుదిశ్యాస విడిచారు. తారకరత్న మరణించి దాదాపు నెల రోజులు కావస్తుంది. ఈయన చనిపోయిన నాటి నుంచి తారకరత్న ఫ్యామిలీ నందమూరి బాలయ్య అండగా ఉంటున్న విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కూడా పలుమార్లు చెప్పింది. అలాగే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. అయితే తాజాగా తారకరత్న విషయంలో నటసింహం బాలయ్య తీసుకున్న నిర్ణయం అందరిని నుంచి ప్రశంసలు కురిపిస్తుంది. తారకరత్నలో ఎవరు కూడా గుండె పోటుతో మరణించడానికి వీలు లేకుండా, హార్ట్ పేషంట్స్ కు ఉచితంగా చికిిత్స అందించాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నాడు.

అంతే కాదు.. బసవతారకం ఆస్పత్రిలో ఓ బ్లాక్ కు తారకరత్న అని నామకరణం కూడా చేశారు. అలాగే గుండె సంబంధిత వ్యాధులతో బాధుపడుతున్న వారికి చికిత్స అందించడానికి భారీ పరికరాలను కూడా కొనుగోలు చేశాడు. కాగా బసవతారకం ఆస్పత్రిని బాలయ్య తన అమ్మ బసవతారకమ గుర్తుగా నిర్మించిన సంగతి తెలిసిందే. బసవతారకమ క్యాన్సర్ తో చనిపోవడంతో, మళ్లీ ఎవరూ కూడా క్యాన్సర్ తో చనిపోవడానికి వీలు లేదని, ఈ ఆస్పత్రిని బాలయ్య ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారు.

- Advertisement -

బాలయ్య చేసిన ఈ పనికి అన్ని చోట్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. బాలయ్య కోపం ఎక్కువే కానీ, ఆయనది బంగారు మనసు అంటూ నందమూరి అభిమానులు నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. కాగా తారకరత్న మరణించిన తర్వాత అన్నితానై చూసుకున్న విషయం తెలిసిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు