Unstoppable- 2: బాలయ్య పారితోషికం పెరిగిందా?

 

నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినా పారితోషికం పెంచిన సందర్భాలు చాలా అరుదు. ఈ విషయంలో ఆయన ఎక్కువగా తన తండ్రి .. నందమూరి తారక రామారావు గారినే ఫాలో అవుతూ ఉంటారు. ఆయన కూడా దర్శక నిర్మాతలకి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో పారితోషికం పెంచేవారు కాదు. బాలయ్య తోటి స్టార్ హీరోలను చూసి కూడా అలా కమర్షియల్ గా ఆలోచించడం లేదు. ఆయన ఉ.. అంటే పెద్ద పెద్ద దర్శక నిర్మాతలు వచ్చి సినిమాలు చేస్తూ ఉంటారు. ఎంత అడిగితే అంత ఇవ్వడానికి రెడీగా ఉంటారు. కానీ బాలయ్య మాత్రం ఇలా పెద్ద నిర్మాత, పెద్ద దర్శకుడు అన్నట్టు ఆలోచించడు. సినిమాల పరంగా మాత్రమే కాదు ఓటీటీ కోసం ఆయన చేసిన ‘అన్ స్టాపబుల్’ షో విషయంలో కూడా అంతే..!

‘అన్ స్టాపబుల్’ సీజన్ 1 కోసం బాలయ్యకి ఒక్కో ఎపిసోడ్ కు గాను రూ.10 లక్షల వరకు పారితోషికం ఇచ్చారట. ఆ సీజన్ మొత్తం 10 ఎపిసోడ్ లు కాబట్టి.. బాలయ్య కి రూ.1 కోటి మాత్రమే పారితోషికం అందింది. అయితే త్వరలో సీజన్ 2 ప్రారంభం కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ కోసం బాలయ్యకి ఒక్కో ఎపిసోడ్ కు రూ.25 లక్షల వరకు పారితోషికం ఫిక్స్ చేశారు మేకర్స్. ఇది కూడా 10 ఎపిసోడ్ లు ఉంటే ఆయనకు రూ.2.5 కోట్లు అందుతుంది అంతే..!

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు