Balakrishna : డిసెంబర్ లో

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన 107వ సినిమా ‘వీర‌సింహారెడ్డి’. ఈ చిత్రానికి గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. రోజు రోజుకు బాల‌కృష్ణ అభిమానుల్లో అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. మామూలుగా తెర‌కెక్కిన సినిమాల్లోనే బాల‌య్య న‌ట‌విశ్వరూపం చూపిస్తుంటారు. అలాంటిది ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్‌తో బ‌రిలోకి దిగారంటే సన్నివేశం ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు.

ముఖ్యంగా బాల‌కృష్ణ సింహా సెంటిమెంట్‌తో ఈ సినిమాకి ‘వీర‌సింహారెడ్డి’ అనే టైటిల్ ఖరారు చేసిన‌ట్టు తెలుస్తోంది. స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు, ల‌క్ష్మీన‌ర‌సింహా, సింహా వంటి సినిమాలు బాల‌య్య‌కి సూప‌ర్ హిట్‌గా నిలిచాయి. ఈ సినిమా కూడా వీర‌సింహారెడ్డి అనే టైటిల్‌తో తెర‌కెక్కింది. ఈ సినిమా కూడా సూప‌ర్ హిట్ గా నిలుస్తుంద‌ని అభిమానులు అంచ‌నాలు వేసుకుంటున్నారు. అఖండ సినిమాకి ప‌ని చేసిన ఫైట్ మాస్ట‌ర్ ఆధ్వ‌ర్యంలోనే గోపిచంద్ మ‌లినేని ఓ యాక్ష‌న్ స‌న్నివేశాన్ని షూట్ చేసిన‌ట్టు స‌మాచారం.

ఇక ఇదిలా ఉండ‌గా.. బాల‌య్య వ‌రుస సినిమాల‌కి క‌మిట్ అయిన విష‌యం తెలిసిందే. ‘NBK 108’ మూవీని ఎఫ్3 ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. బాల‌య్య ప్ర‌స్తుతం న‌టిస్తున్న 107 మూవీ షూటింగ్ దాదాపు పూర్త‌యిన‌ట్టే తెలుస్తోంది. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా బాల‌య్య జ‌న‌వ‌రి 12న వ‌స్తున్నాడు. న‌వంబ‌ర్ నెల‌లోపు బ్యాలెన్స్ ఉన్న సీన్ల‌ను బాల‌య్య‌తో తెర‌కెక్కించనున్నార‌ట‌. ఇక డిసెంబ‌ర్ త‌రువాత బాల‌య్య అనిల్ రావిపూడి సినిమాలో న‌టించ‌నున్నట్టు స‌మాచారం. గ్యాప్ లేకుండా బాల‌య్య వ‌రుస సినిమాల‌ను చేయ‌డం విశేషం. మ‌రోవైపు అన్‌స్టాప‌బుల్ టాక్ షో లో కూడా రాణిస్తున్న విష‌యం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు