Bandla Ganesh : అబ్బ ముద్దొస్తున్నావ్.. బాస్

“ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా..” ఈ డైలాగ్ చెప్పామంటే.. ఎవరి గురించో ఈజీగా తెలిసిపోతుంది. అదేనండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీర భక్తుడు బండ్ల గణేష్ గురించే. పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ ఎంత పెద్ద అభిమానియో.. తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయం వచ్చిన ప్రతి సారి పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ తన ప్రేమను చూపిస్తాడు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ సందడి అంతా ఇంత కాదు.

బండ్ల గణేష్ స్పీచ్ కోసమే కొంత మంది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లను చూస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ రెండు సినిమాలకు గణేష్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. అందులో తీన్ మార్ నిరాశపరుచగా, గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీని తర్వాత ముచ్చటగా మూడోసారి పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉండాలని తెగ ముచ్చటపడుతున్నాడు గణేష్. దీని కోసం చాలా సార్లు ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ అది జరగలేదు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండటం వల్ల అడపా దడపా సినిమాలు చేస్తున్నాడు. చాలా రోజుల క్రితం స్టార్ట్ చేసిన హరి హర వీరమల్లు ఇంకా పూర్తి కాలేదు. ఇక హరీష్ శంకర్ సినిమా గురించి మాట్లాడక పోవడమే మంచిది. ఇదిలా ఉండగా, తాజాగా హరి హర వీరమల్లు వర్క్ షాప్ నిర్వహించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలో అక్కడి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఈ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ న్యూ లుక్ అదిరిపోయింది. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. పవన్ వీరాభిమాని బండ్ల గణేష్ కూడా ఈ ఫోటోను షేర్ చేశాడు. “అబ్బబ్బ మా బాస్ ను చూస్తుంటే గుండెల్లో దడ దడ మొదలయ్యింది. రక్తం ఉరకలేస్తుంది.. ఇప్పుడు ఒక్క చాన్స్ వస్తే.? వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా.. అబ్బ ముద్దొస్తున్నావ్.. బాస్” అంటూ ఓ క్యాప్షన్ కూడా రాశాడు. దీంతో పవన్ తర్వాతి సినిమాను అయినా తనకు ఇవ్వాలని బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా అడిగాడు. అయితే పవన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలు చేయడం కష్టమే కావచ్చు. అంటే.. వెయ్యి కోట్ల మార్కెట్ కూడా కష్టమే అవుతుంది మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు