Bhanupriya: మెమొరీ లాస్ తో బాధపడుతున్నాను

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో నటి భానుప్రియ కూడా ఒకరు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, హిందీ సినీ ప్రేక్షకులను తన నటన, గ్లామర్ తో అలరించింది భానుప్రియ. మరో శ్రీదేవిగా పేరు ఉన్న భానుప్రియ అప్పట్లో ఓ డాన్సింగ్ సెన్సేషన్. సంప్రదాయ నృత్యంతో, హావభావాలతో భానుప్రియ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. తన కెరీర్ లో ఎక్కువ సక్సెస్ రేట్ తో దూసుకుపోయిన ఈ సీనియర్ స్టార్.. ఆ తర్వాత కూడా క్యారెక్టర్ రోల్స్ తో సందడి చేసింది. హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తర్వాత కొన్ని రోజులు తెరకు దూరం అయిన భానుప్రియ.. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది. గత కొద్ది కాలంగా సినిమాల్లో కనిపించడం మానేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భానుప్రియ సంచలన విషయాలను వెల్లడించింది.

తనకి మెమరీ లాస్ ఇబ్బంది ఉన్నట్లు ఆమె వెల్లడించింది. ” మా వారు చనిపోయారు.. అప్పటినుండి మెమరీ లాస్ అయ్యాను. డైలాగ్స్ కూడా గుర్తుండడం లేదు. డ్యాన్స్ కి సంబంధించిన ముద్రలు కూడా గుర్తుండడం లేదు. అందువల్లనే డాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచన కూడా విరమించుకున్నాను. ప్రస్తుతానికి మెడిసిన్స్ తీసుకుంటున్నాను. మా వారు చనిపోవడానికంటే ముందే నేను ఆయనతో విడిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదు. విదేశాలలో ఉన్న ఆయన ఇక్కడికి వస్తుండేవారు. నేను అక్కడికి వెళుతూ ఉండేదాన్ని. విడివిడిగా ఉండే వాళ్ళం అనేది పుకారు మాత్రమే. మా అమ్మాయి అభినయం లండన్ లో చదువుతోంది. తనకి సినిమాల వైపు వచ్చే ఆలోచన లేదు” అని తెలిపారు భానుప్రియ.మెమొరీ లాస్ తో బాధపడుతున్నాను – భానుప్రియ

For More Updates :

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు