Bhavadiyudu Bhagat Singh: పవన్ రోల్ ఇదేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో మంచి హిట్లు అందుకొని ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో అతి త్వరలోనే భవదీయుడు భగత్ సింగ్ చిత్రం ప్రారంభించనున్నారు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంబినేషన్ కావడంతో ఈ సినిమాని ప్రకటించిన రోజు నుండి అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కి పొలిటికల్ కమిట్మెంట్స్ మరియు హరిహర వీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.

ఈ చిత్రాన్ని నవీన్, వై రవిశంకర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో పవన్ చేయబోయే రోల్ గురించి తాజాగా సోషల్ మీడియాలో కొన్ని గాసిప్స్ వస్తున్నాయి. ఈ సినిమా ఓ మంచి సోషల్ మెసేజ్ తో రాబోతుందని.. ఇందులో పవన్ కళ్యాణ్ ఓ కాలేజ్ ప్రొఫెసర్ గా నటిస్తున్నాడని అన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఇందులో ఓ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారని సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో విలన్ గా తమిళ హీరో విజయ్ సేతుపతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనతో ఈ చిత్ర దర్శకుడు హరిశంకర్ చర్చలు జరపగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలింనగర్ లో వినిపిస్తున్న సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు