Bhola Shankar: భోళా మేనియా..చిరు మాత్రమే?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ నుండి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించగా మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మొదటి పాట ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయగా పాట మాత్రం మిక్సడ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, రేవంత్ ఈ పాటను పాడారు. లిరిక్స్ వరకు చాలా బాగున్న ఈ పాట, సింగర్ వాయిస్ మాత్రం చిరుకు మ్యాచ్ కాలేదు. పైగా ఈ పాటలోని ట్యూన్స్ చిరు పాత సినిమాల పాటల్నే పోలి ఉండగా ఫ్రెష్ ట్యూన్స్ మాత్రం ఒక్కటి కూడా అనిపించలేదు. అయితే లుక్స్ పరంగా చిరు ఈ సినిమాలో ఫ్రెష్ గా కనిపించారు.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు కావడంతో ఈ సినిమాపై మహతి నుంచి అభిమానులు చాలా ఊహించారు. కానీ మొదట్లోనే ఇలా గాలి తీసేస్తాడని అనుకోలేదు. ఇక పాట చిరు ఇంట్రో సాంగ్ అని చూస్తేనే తెలిసిపోతుంది. ఇక మెగాస్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ అంటే కొరియోగ్రఫీ ఏ రేంజ్ లో ఉండాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డాన్స్ కి పెట్టింది పేరైన చిరుకి ఈ సాంగ్ లో మాత్రం సరైన స్టెప్స్ అస్సలు పడలేదు. పైగా కొరియోగ్రాఫర్ టాప్ డాన్సర్లలో ఒకరైన శేఖర్ మాస్టర్.

ఈ పాట వింటున్నంత సేపు చిరు పాటలా అనిపించలేదు. ఎదో డబ్బింగ్ సాంగ్ లా అనిపించగా, ట్యూన్స్ తో మహతి స్వరసాగర్ మణిశర్మ పాటల్లో సగం కూడా మ్యాచ్ చేయలేకపోయాడు. ఓవరాల్ గా భోళా శంకర్ నుండి వచ్చిన మొదటి పాటలో మెగాస్టార్ చిరంజీవి, రామ జోగయ్యశాస్త్రి లిరిక్స్ తప్ప ఏమి అంతగా ఆకట్టుకోలేవు. మరి మ్యూజిక్ డైరెక్టర్ రెండో పాటతోనైనా ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు