Koratala : బిగ్ ఛాలెంజ్

సినిమా రంగంలో విజయం అపజయం సహజం. ఎంత పెద్ద స్టార్ హీరోలు అయినా కథ, కథనం బాగాలేక దారుణమైన అపజయాలను మూటగట్టుకుంటున్నారు. చిన్న హీరోలు ఇంట్రెస్టింగ్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అనూహ్య విజయాన్ని సాధిస్తున్నారు. ఇందులో పెద్ద హీరోల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ప్రారంభంలో ఆచార్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఆచార్యలో మెగాస్టార్ తో పాటు ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కనిపించాడు. ఇద్దరు పెద్ద స్టార్లు సినిమాలో ఉండటం, తొలిసారి మెగా తండ్రికొడుకులు సిల్వర్ స్క్రిన్ పై కనిపించడంతో ఆచార్యపై ఆకాశాన్ని తాకే అంతటి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ, ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీనికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ డిజాస్టర్ కు కారణంగా డైరెక్టర్ కొరటాల శివనే చూపిస్తున్నారు.

ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. దీంతో చాలా రోజుల తర్వాత మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. చిరుకు మోహన్ రాజా లాంటి చిన్న డైరెక్టర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అందించాడని, కానీ స్టార్ డైరెక్టర్ గా, సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు పెట్టుకున్న వారు మాత్రం డిజాస్టర్ చేశారని కొరటాల శివను ఉద్ధేశిస్తూ నెట్టింట్లో ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.

- Advertisement -

దీనికి కౌంటర్ గా కూడా పోస్టులు వస్తున్నాయి. ఆచార్య డిజాస్టర్ కావడానికి కొరటాల కారణం కాదని మరో వర్గం ఫ్యాన్స్ అంటున్నారు. కొరటాల శివ టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అని కామెంట్ చేస్తున్నారు. చిరంజీవి వల్ల ఆచార్య ప్లాప్ అయిందని విమర్శిస్తున్నారు. కొరటాల తర్వాత సినిమా NTR30 తప్పకుండా బ్లాక్ బస్టర్ అయ్యేలా కొరటాల డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు.

ఈ ఫ్యాన్స్ వల్ల కొరటాల శివ ముందు ప్రస్తుతం భారీ సవాల్ ఉంది. ఒక వేళ NTR30 కూడా ప్లాప్ అయితే.. ఇప్పటి వరకు సపోర్ట్ గా వస్తున్న తారక్ ఫ్యాన్స్ కూడా కొరటాలకు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే అవకాశాలు కూడా తగ్గే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో NTR30ని కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా రూపొందించే బిగ్ ఛాలెంజ్ కొరటాల ముందు ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు