Rakhi Sawant : మళ్ళీ ప్రేమలో పడ్డ బిగ్ బాస్ బ్యూటి

బాలీవుడ్ లో రాఖీ సావంత్ అంటే తెలియని వారుండరు. పలు సినిమాల్లో నటించిన ఈ భామ, బిగ్ బాస్ షో తో పాపులారిటీని తెచ్చుకుంది. రాఖీ సావంత్ గురించి చెప్పాలంటే, బిగ్ బాస్ ముందు, తర్వాత అని చెప్పవచ్చు. బాలీవుడ్ ఐటెం సాంగ్స్ తో రాఖీ సావంత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

రాఖీ సావంత్ వాలెంటన్స్ డే రోజు తన భర్త రితేశ్ సింగ్ తో డైవర్స్ తీసుకున్న విషయం తెలిసిందే. రితేశ్ సింగ్ తో కొద్ది రోజులు రిలేషన్ షిప్ లో ఉన్న ఈ ఐటెం బాంబ్, చివరికి అతన్నే పెళ్లి చేసుకుంది. అయితే రితేశ్ కు ఇప్పటికే పెళ్లి అయిందని, పిల్లలు ఉన్నారని తెలిసి డైవర్స్ తీసుకుంది. డైవర్స్ తర్వాత ఒంటరి జీవితాన్ని ఆస్వాదిస్తానని చెప్పి ఈ బిగ్ బాస్ బ్యూటీ, త్వరగానే లవ్ లో పడింది.

ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన రాఖీ సావంత్, తన కంటే ఆరేళ్ల చిన్న వాడైన అదిల్‌ దురానీతో ప్రేమలో పడినట్టు అనౌన్స్ చేసింది. డైవర్స్ తర్వాత తాను డిప్రెషన్స్ లోకి వెళ్లానని, అప్పుడు అదిల్ పరిచయమయ్యాడని తెలిపింది. అదిల్ పరిచయమైన పది రోజుల్లోనే ప్రపోజ్ చేశాడని, తాను రిజక్ట్ చేశానని వివరించింది. ఆరేళ్ల చిన్నవాడితో ప్రేమేంటని అనుకున్నట్టు చెప్పుకొచ్చింది.

- Advertisement -

ప్రియాంక చోప్రా- నిక్‌ జోనస్‌, మలైకా అరోరా- అర్జున్‌ కపూర్‌ గురించి అదిల్ చెప్పి తన మనసు మార్చినట్టు పేర్కొంది. అంతే కాకుండా తనకు అదిల్, బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్ కూడా ఇచ్చినట్టు వివరించింది. అయితే అదిల్ కుటుంబ సభ్యులను తనను అంగీకరించడం లేదని, త్వరలోనే వారిని ఒప్పించి వివాహం చేసుకుంటామని చెప్పుకొచ్చింది.

అయితే రాఖీ సావంత్ – అదిల్ దురానీ జంట ఎన్ని రోజులు కలిసి ఉంటుంది..? వీరు పెళ్లి పీఠలు ఎక్కుతారా..? అనే ప్రశ్నలు నెటిజన్ల నుండి వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు