Bindu Madhavi : కప్, ఛాన్స్ కలిసొచ్చాయి

బిగ్ బాస్.. టాలీవుడ్ లో అవకాశాలుకు చక్కని ప్లాట్ ఫాం. ఇప్పటి వరకు చాలా మంది నటీ నటులు బిగ్ బాస్ తో క్రేజ్ తెచ్చుకుని, సినిమా ఛాన్స్ లను కొట్టేశారు. ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్, ఈ సారి 24 గంటలు స్ట్రీమింగ్ కాన్సెప్ట్ తో, బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ తొలి సీజన్ ఇటీవల ముగిసింది. తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే తొలి సారి ఓ మహిళ కప్ కొట్టింది. తొలి వారం నుండే తన పాజిటివ్ నెస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బిందు మాధవియే టైటిల్ విన్నర్ అయ్యారు. తెలుగు ప్రేక్షకులతో పాటు కోలీవుడ్ సపోర్ట్ తో బిందు మాధవి విజయ తీరాలకు చేరింది.

తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని, మళ్లీ అవకాశాలు దక్కించుకోవాలనే లక్ష్యంతోనే బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చానని ఓపెన్ గానే ప్రకటించిన బిందు మాధవి. చివరికి అనుకున్నది సాధించుకుంది. ఏకంగా బాలయ్య సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది ఈ ఆడపులి.

- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలయ్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బిందుమాధవి కోసం ఓ పాత్రను రెడీ చేస్తానని, అన్నీ అనుకున్నట్టు జరిగితే బాలయ్య సినిమాలోనే ఆ పాత్ర ఉండేలా ట్రై చేస్తానని అనిల్ రావిపూడి ప్రకటించాడు. దీంతో ఈ అమ్మడు బిగ్ బాస్ కప్ తో పాటు క్రేజీ ఛాన్స్ కొట్టేసిందని ప్రేక్షకులు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు