ప్రస్తుత కాలంలో అన్ని సినిమా ఇండస్ట్రీల్లో రీరిలీజ్ ట్రెండ్ శర వేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలను ఆయా హీరోల పుట్టిన రోజులను పురష్కరించుకుని, లేదా ఆ సినిమాలు రిలీజ్ అయిన డేట్స్ లో మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో నిర్మాతలు దీన్ని క్యాష్ చేసుకుంటూ వరుసగా సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే చాలా సినిమాలు మళ్లీ సిల్వర్ స్క్రిన్ పై రాగా.. తాజాగా మరో సినిమా రీ రిలీజ్ కు సిద్ధమవుతుందని తెలుస్తోంది. దేశమంతటా దుమారాన్ని రేపిన సినిమాలో “కాశ్మీర్ ఫైల్స్” సినిమా ఒకటి. కాశ్మీర్ పండిట్ లపై జరిగిన అఘాయిత్యాల నేపధ్యంలో సాగే ఈ సినిమా విడుదుల తర్వాత ప్రేక్షకుల ప్రశంశలు అందుకుంది. కొంత మంది మూవీ లవర్స్ ఈ సినిమాను థియేటర్స్ లో క్లాప్స్ కొట్టి అభినందించారు. అలాగే మరి కొంతమంది నుంచి విమర్శలు కూడా వచ్చాయి. ఈ సినిమాలో పల్లవి జోషి, అనుపేమ్ ఖేర్, దర్శన్ కుమార్ మరియు తది తరులు ముఖ్య పాత్రలో నటించారు.
ఈ సినిమాపై వచ్చే విమర్శలు పార్లమెంట్ వరకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. కాశ్మీరీ హిందూ జాతి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన కాశ్మీర్ ఫైల్స్ ను మళ్లీ విడుదల చేయాలని నిర్మాతలు అభిషేక్ అగర్వాల్ మరియు వివేక్ రంజన్ అగ్నిహోత్రి భావిస్తున్నారు. దీంతో రేపు కాశ్మీర్ ఫైల్స్ మరోసారి థియేటర్ లలో కనిపించనుంది.
‘THE KASHMIR FILES’ RE-RELEASING ON 19
JAN… #TheKashmirFiles is re-releasing on 19 Jan 2023 [Kashmiri Hindu Genocide Day]… Re-releasing within a year of its first release. pic.twitter.com/cvPpio4OR9— taran adarsh (@taran_adarsh) January 18, 2023