Ram Gopal Varma: బాలీవుడ్ ఇక మీ సినిమాలు ఓటిటి లోనే

రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్
ఒక్కోసారి వేదంతిలా మాట్లాడటం, మరికొన్ని సార్లు సిద్ధాంతిలా మాట్లాడటం ఆయనకు వోడ్కా తో పెట్టిన విద్య. ఎప్పుడూ తన ట్వీట్ తో ఎవరినో టార్గెట్ చేసే వర్మ ఈ సారిపై బాలీవుడ్ సినిమాలపై సైటైర్లు వెయ్యడం మొదలుపెట్టాడు.

ఇటీవల కాలంలో పుష్ప, కెజిఫ్, ఆర్ఆర్ఆర్ వంటి సౌత్ సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గా విడుదల అయ్యి సూపర్ సక్సెస్ ను అందుకుంటున్నాయి. నార్త్ సినిమాలు ఊహించిన రీతిలో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇదే విషయంపై తనదైన శైలి లో ట్వీట్ చేసారు వర్మ.

’’సౌత్ సినిమాలన్నీ థియేటర్లలోకి వెళ్లడానికి ఆసక్తితో ఉంటాయి’’
’’కానీ నార్త్ సినిమాలు థియేటర్లలోకి వెళ్లడం అంతగా ఇష్టం లేనట్టు ఉంది’’
ఇది ఇలాగే సాగితే.. ’’కొద్ది రోజుల్లోనే ఓటీటీల కోసమే బాలీవుడ్ సినిమాలు నిర్మించాల్సి వస్తుంది’’ అంటూ బాలీవుడ్ ను తక్కువ చేస్తూ ట్వీట్ చేశాడు వర్మ. కాగ ప్రస్తుతం ఈ ట్వీట్ బీ టౌన్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది.

- Advertisement -

కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, బాలీవుడ్ నన్ను భరించలేదంటూ చేసిన వ్యాఖ్యలకు బీ టౌన్ స్పందించింది. ఇప్పుడు ఆర్జీవీ ట్వీట్స్ పై బాలీవుడ్ స్టార్స్ స్పందిస్తారా..? లేక వర్మతో కర్మ ఎందుకని వదిలేస్తారా..? అనేది చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు