Tollywood vs Bollywood : హిందీ దర్శకులపై ఆశలొదిలేసుకున్న బాలీవుడ్ హీరోలు… టాలీవుడ్ డైరెక్టర్స్ కోసం క్యూ

ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ హవానే నడుస్తోంది. నిన్న మొన్నటిదాకా బాలీవుడ్ ఎగిరెగిరి పడింది. కానీ ఇప్పుడు సౌత్ సందడి ముందు బాలీవుడ్ వెలవెలబోయింది. ముఖ్యంగా తెలుగు దర్శకుల టాలెంట్, హీరోల కంటెంట్ సెలక్షన్, విభిన్నమైన కథలతో ప్రేక్షకుల మనసును గెలుచుకోవడంతో పాటు తెలుగు స్టార్స్ పాన్ ఇండియా రేసులో దూసుకెళ్తుంటే, వీళ్ళ స్పీడ్ ను బాలీవుడ్ బడా స్టార్స్ సైతం తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కుమార్ హిరానీ వంటి దర్శకుడు కూడా టాలీవుడ్ పై పైచేయి సాధించలేకపోతున్నారు. ఇక పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ టాలీవుడ్ సినిమాలు సక్సెస్ కాకుండా నిలవరించలేకపోతున్నారు. రీసెంట్ గా జరిగిన “డంకీ” వర్సెస్ “సలార్” క్లాష్ వివాదమే అందుకు నిదర్శనం.

ఇక ఇలాంటి టైంలో ఎలాగైనా సత్తా చాటాలని ప్రయత్నించిన బాలీవుడ్ బడా డైరెక్టర్స్ రాజ్ కుమార్ హిరానీ, సిద్దార్థ్ ఆనంద్ వంటి దర్శకుల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. పఠాన్, జవాన్ వంటి సినిమాలతో వరుసగా రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చిన షారుక్ కు “డంకీ”తో గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఆ రెండు సినిమాల్లోనూ “జవాన్” మూవీకి సౌత్ డైరెక్టర్ అట్లినే దర్శకత్వం వహించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్స్ హిందీ దర్శకులపై ఆశలు వదిలేసుకుని సౌత్ డైరెక్టర్స్ వెంటపడుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లోని చాలామంది స్టార్ హీరోలు వరుస డిజాస్టర్ లతో, ఒక్క హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతున్నారు. మరోవైపు చాలామంది నార్త్ ఆడియన్స్ ఇప్పుడు సౌత్ సినిమాలను చూడడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్, పుష్ప, కేజిఎఫ్ వంటి సినిమాలు నార్త్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడం చూశాం. ఈ క్రమంలో పలు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు తమ నెక్స్ట్ సినిమాల కోసం సౌత్ డైరెక్టర్స్ ను సెలెక్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే పలువురు తెలుగు అగ్ర దర్శకులను కలిసి సంప్రదింపులు జరుపుతున్నారు.

తెలుగు లేదా తమిళ దర్శకుడితో బాలీవుడ్ స్టార్ హీరోగా సినిమా చేయాలి అన్నదే ఈ బాలీవుడ్ నిర్మాణ సంస్థల టార్గెట్ అని తెలుస్తోంది. ఇక చాలామంది టాలీవుడ్ నిర్మాతలు కూడా బాలీవుడ్ హీరోలతో చేతులు కలపడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొంతమంది తెలుగు దర్శకుల డేట్స్ వాళ్ల చేతుల్లో ఉండడంతో ఆ ప్లాన్లో భాగం కావడానికి సిద్ధం అవుతున్నారు. అట్లీ, ఏఆర్ మురుగదాస్, అజయ్ భూపతి, హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని వంటి దర్శకులు బాలీవుడ్ సినిమాలను తీయబోయే డైరెక్టర్స్ లిస్ట్ లో ఉన్నారు. ఇప్పటికైతే ఈ దర్శకులతో పలు ప్రాజెక్ట్ ల గురించి చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి బాలీవుడ్ స్టార్స్ హిందీ డైరెక్టర్స్ తీస్తున్న బోరింగ్, రొటీన్ స్టోరీలతో సరైన హిట్లు లేక విసిగి వేసారి పోయారు. హిట్ కావాలంటే సౌత్ డైరెక్టర్స్ కావాల్సిందేనని ఇప్పటికి అర్థం చేసుకున్నారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు