Boss Party : అదిరిపోయనది పార్టీ..

మెగాస్టార్ చిరంజీవి మాస్ లుక్ తో ఊర మాస్ స్టెప్స్ వేసి చాలా రోజులు అవుతుంది. దీంతో చిరుని మాస్ సాంగ్స్ లో చూడటం ఎప్పుడెప్పుడా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వాల్తేరు వీరయ్య సినిమాతో మెగా ఫ్యాన్స్ కోరిక తీరబోతుంది. బాబి దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ ఊర మాస్ పాత్ర చేయబోతున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, టైటిల్స్ గ్లింప్స్ లో చిరు లుక్ పై క్లారిటీ వచ్చింది.

తాజాగా ఈ సినిమాలోని బాస్ పార్టీ అంటూ ఒక సాంగ్ ను విడుదల చేశారు. ముందుగా ఈ సాంగ్ గ్లింప్స్ ను మంగళవారం రిలీజ్ చేశారు. అందులో చిరు లుక్ ఆకట్టుకున్నా.. దేవి శ్రీ ప్రసాద్ నుంచి వచ్చిన ర్యాప్ పెద్దగా నచ్చలేదు. అంతే కాదు.. చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. దీంతో బాస్ పార్టీ ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో అని మెగా అభిమానులు తెగ టెన్షన్ పడ్డారు. మరి తాజాగా విడుదలైన బాస్ పార్టీ ఫుల్ సాంగ్ ఎలా ఉందో చూద్ధాం..

3:08 నిమిషాల నిడివి ఉన్న పాటలో మొదటగా చెప్పుకొదగ్గ విషయం.. మెగాస్టార్ చిరంజీవి. 67 ఏళ్ల వయసు వచ్చినా డ్యాన్స్ లో గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు. అలాగే ఇందులో కనిపించే మాస్ లుక్ ఘరానా మొగుడును గుర్తు చేస్తుంది. ఈ లుక్, మాస్ డ్యాన్స్ మెగా అభిమానులకు ఫుల్ మీల్స్ లా ఉందని చెప్పొచ్చు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఈ సాంగ్ కు మరొక హైలైట్ గా ఉంది. తన అందం సాంగ్ కు కలిసొచ్చింది. అలాగే సాంగ్ ప్రారంభంలో, చివరలో.. “డీజే వీరయ్య..” అంటూ చిరంజీవి నుంచి రావడం అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.

- Advertisement -

దీంతో పాటు సాంగ్, మ్యూజిక్ కూడా బాగానే ఉన్నాయి. కానీ మధ్యలో దేవి శ్రీ ప్రసాద్ నుంచి వచ్చే ర్యాప్ కాస్త ఇబ్బేట్టుగా అనిపిస్తుంది. అది మినహా సాంగ్ మొత్తం బాగానే ఉంది. అయితే ఎప్పటి లాగే దేవి శ్రీ ప్రసాద్ సాంగ్ వెంటనే ఆడియన్స్ కు నచ్చకపోవచ్చు. కానీ, రోజులు గడుస్తున్న కొద్ది.. ఈ సాంగ్ ట్రెండింగ్ లోకి రావొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు