Huma Qureshi : మరో బ్రేకప్ న్యూస్

సినిమా ఇండస్ట్రీలో లవ్ ట్రాక్ లు, డేటింగ్ లు కామన్. అలాగే బ్రేకప్ లు కూడా కామన్. బాలీవుడ్ లో అయితే ఇలాంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తాయి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో బ్రేకప్ వార్తలు మరీ ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల ఓ హీరోయిన్ తన భాయ్ ఫ్రెండ్ తో విడిపోయిందని, మరో హీరోయిన్ తన భర్తతో డైవర్స్ తీసుకోవడానికి సిద్ధమయిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా బీ టౌన్ మరో వార్త బ్రేక్ వార్త చక్కర్లు కొడుతుంది.

బాలీవుడ్ తో పాటు సౌత్ ప్రేక్షకులకు పరిచయం ఉన్న పేరు ఉమ ఖూరేషి. ఈమె హిందీతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లో కూడా కనిపించింది. ఇదిలా ఉండగా ఉమ ఖూరేషి, ముదస్సర్ అజీజ్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల పాటు ఉమ ఖూరేషి, ముదస్సర్ అజీజ్ ప్రేమ వ్యవహారాన్ని నడిపించారు. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నారని వీరి సన్నిహితుల నుంచి న్యూస్ వచ్చింది.

అయితే ప్రస్తుతం వీరి మధ్య ప్రేమ బంధం తెగిపోయిందని తెలుస్తుంది. తమ మనసులు కలవడం లేదని, ఇక నుంచి కలిసి ఉండటం సాధ్యం కాదని, విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని బీ టౌన్ మీడియా కోడై కూస్తుంది. అయితే ఈ వార్తలపై అటు ఉమ ఖూరేషి గానీ, ఇటు ముదస్సర్ అజీజ్ గానీ అధికారికంగా స్పందించలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు