Chandrika Ravi : జీవితాంతం గుర్తుంచుకుంటా..

నందమూరి నటసింహం బాలయ్య, శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం వీర సింహా రెడ్డి. విన్నర్, క్రాక్ వంటి సినిమాలను తెరకెక్కించిన గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందకు రానుంది. దీని కోసం చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే ప్రమోషన్ పనులను ప్రారంభించింది.
ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన టైటిల్ గ్లింప్స్, జై బాలయ్య.. సుగుణ సుందరి సాంగ్స్ నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా అంచనాలను పెంచింది. వీటితో పాటు ఇటీవల వీర సింహా రెడ్డి నుంచి మా బావ మనోభావాలు… అనే మాస్ సాంగ్ వచ్చిన సంగతి విధితమే. ఈ సాంగ్ లో బాలయ్య మాస్ స్టెప్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ మాస్ సాంగ్ లో చంద్రికా రవి, హానీ రోజ్ లతో బాలయ్య స్టెప్స్ వేశాడు.
టాలీవుడ్ అగ్ర హీరో బాలయ్యతో డ్యాన్స్ చేయడంపై చంద్రిక రవి స్పందించింది. “మా బావ మనోభావాలు సాంగ్ బాలయ్య సార్ తో డ్యాన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఆస్ట్రేలియా లో పుట్టి, పెరిగాను. కానీ చిన్ననాటి నుంచి సౌత్ సినిమాలు చూస్తున్నాను. బాలయ్య తో డ్యాన్స్ చేయడం, ఆయనతో సెట్ లో గడిపిన క్షణాలను జీవితాంతం గుర్తుంచుకుంటాను. మొదటి రోజు సెట్ లోకి నడుచుకుంటూ వెళ్తుంటే నా కల నిజమైందని ఫీల్ వచ్చింది. మా బావ మనోభావాలు సాంగ్ కు సంగీతం, సెట్ డిజైన్, కాస్ట్యూమ్స్ అన్ని బాగా కుదిరియి” అంటూ తన చంద్రిక రవి చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు