Charmy Kaur : బాధగా ఉంది

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో లెటెస్ట్ గా వచ్చిన చిత్రం లైగర్. దాదాపుగా రూ. 180 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25వ తేదీన పాన్ ఇండియా స్థాయి విడుదల చేశారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ అలాగే ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ ఎత్తున ప్రమోషన్లు చేసిన తర్వాత ఈ చిత్రంపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. కానీ విడుదల రోజే ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచింది.

దీంతో సోషల్ మీడియాలో పూరీ జగన్నాథ్ పై, ఛార్మీ పై, విజయ్ దేవరకొండపై ట్రోల్స్ వచ్చాయి. ఈ వారంతంలో కూడా సినిమాకు కలెక్షన్లు ఎక్కువగా రాలేవు. ఇప్పటి వరకు దాదాపు రూ. 50 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఈ చిత్రం నష్టాల నుండి తప్పించుకోవాలంటే కనీసం రూ. 65 కోట్ల వరకు వసూలు చేయాలి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది అసాధ్యం అని తెలుస్తుంది. దీంతో పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కెరీర్ లోనే లైగర్ భారీ డిజాస్టార్ గా మిగలనుంది.

అయితే తాజాగా లైగర్ ప్లాప్ పై నిర్మాత ఛార్మీ కౌర్ స్పందించింది. ” ప్రస్తుతం ప్రజలు ఇంట్లో కూర్చొనే భారీ బడ్జెట్ సినిమాలు చూసే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే సినిమాలు వారిని ఎగ్జైట్ చేస్తేనే థియేటర్ లకు వస్తున్నారు. బింబిసార, సీతారామం, కార్తికేయ2 వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. అలాగే బాలీవుడ్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కానీ మేము మూడేళ్లు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని, చాలా కష్టపడి లైగర్ ను తెరకెక్కించాం. ఇప్పుడు ఇలా ఫెయిల్యూర్ అవడం బాధగా ఉంది ” అంటూ నిర్మాత ఛార్మీ కౌర్ బాధపడింది. కాగా ఈ చిత్రం కోసం ఛార్మీ చాలా వరకు డబ్బులు ఖర్చు చేసిందని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు