Chay: నాగార్జున కు జంటగా చైతన్య హీరోయిన్ ?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు అటు తండ్రితో, ఇటు కొడుకుతో హీరోయిన్ చేయడం సాధారణంగా జరుగుతుంది. ఇలాంటివి ఇప్పటి వరకు టాలీవుడ్ లో చాలా సార్లు చోటు చేసుకున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీరలో కాజల్ తో ఆడిపాడడు. అదే కాజల్ తర్వాత మెగా స్టార్ తో ఖైదీ నెంబర్ 150లో రొమాన్స్ చేసింది. ఇలాంటివి ఒక మెగా ఫ్యామిలీలోనే కాదు.. అక్కినేని కుటుంబంలో కూడా కనిపిస్తాయి.

అక్కినేని నట వారసుడు నాగ చైతన్యతో కలిసి నటించిన పలువురు హీరోయిన్స్ నాగ చైతన్య తండ్రి యువ సామ్రాట్ నాగార్జున సరసన కూడా నటించారు. నాగ చైతన్య, రకుల్ ప్రిత్ సింగ్ కలిసి రారండోయ్ వేడుక చూద్దం అనే సినిమాలో నటించారు. కొన్ని రోజుల తర్వాత రకుల్ ప్రిత్ సింగ్ నాగార్జున తో డీప్ రొమాన్స్ ఉన్నా.. మన్మథుడు 2లో నటించింది. ఆ సమయంలో రకుల్ ప్రిత్ పై చాలా విమర్శలు వచ్చాయి. అయినా సినిమా ఇండస్ట్రీలో అలా నటించడం సాధారణం కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

అయితే తాజాగా అక్కినేని హీరోల గురించి ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. నాగ చైతన్య కు హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే ఇప్పుడు నాగార్జున తో కూడా కలిసి నటించడానికి రెడీ అవుతుందట. పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో నాగ చైతన్యతో ఒక లైలా కోసం అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ బ్యూటీ కింగ్ నాగార్జున తో కూడా నటించడానికి సిద్ధమైందని టాక్. అయితే అది సినిమా కాదట. ఒక కమర్షియల్ యాడ్ లో నాగార్జున, పూజా హెగ్డే కనిపించబోతున్నారట. అయితే ఈ యాడ్ లో వీరి లుక్స్ సాధారణంగా కంటే చాలా భిన్నంగా ఉండబోతున్నాయని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ హాట్ టాపిక్ గా ఉంది.

- Advertisement -

For More Updates: Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు