Chiranjeevi : డైలాగ్ అదుర్స్‌

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన త‌రువాత వ‌రుస సినిమాల‌తో ప్ర‌స్తుతం బిజీగా ఉన్నాడ‌నే విష‌యం తెలిసిందే. ఖైదీ నెంబ‌ర్ 150, సైరా న‌ర‌సింహారెడ్డి, ఆచార్య వంటి సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆచార్య సినిమా ఆశించిన మేర‌కు ఆక‌ట్టుకోలేద‌నే చెప్పాలి. ఆచార్య‌తో నిరాశ‌ప‌రిచిన చిరు ఈసారి అభిమానుల‌కు సూప‌ర్ హిట్ అందించాల‌నే క‌సిగా ఉన్నాడు. మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ సాధించిన సినిమా లూసిఫ‌ర్‌ను తెలుగులో గాడ్ ఫాద‌ర్ గా రీమెక్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

కోలీవుడ్ డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్ ప్రారంభించ‌క‌పోయే స‌రికి ఈ సినిమా వాయిదా ప‌డుతుంద‌నే వార్త‌లు వినిపించాయి. చిత్ర బృందం వాటిపై క్లారిటీ ఇచ్చారు. వాయిదా అని వ‌స్తున్న వార్త‌ల‌న్ని రూమ‌ర్స్ అని, గాడ్ ఫాద‌ర్ అనుకున్న స‌మ‌యానికే విడుద‌ల అవుతుంద‌ని వెల్ల‌డించారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. రాజ‌కీయాల గురించి చిరు ఒక వాయిస్ ట్వీట్‌ని షేర్ చేశారు. నేను రాజ‌కీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజ‌కీయం నా నుంచి దూరం కాలేదు అంటూ చిరు వాయిస్‌తో చెప్పిన ఈ డైలాగ్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ముఖ్యంగా చిరంజీవి 2008లో ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించి రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. కొద్ది రోజుల‌కే ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి సినిమాల్లోనే న‌టిస్తున్నారు. చిరంజీవి నోటా రాజ‌కీయం మాట రావ‌డంతో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ డైలాగ్ గాడ్ ఫాద‌ర్ సినిమాలోనిది అయి ఉంటుంద‌ని, సినిమాకి సంబంధించి డ‌బ్బింగ్ ప‌నుల‌ను పూర్తి చేస్తూ చిరు ఈ డైలాగ్‌ని షేర్ చేసి ఉంటార‌ని చెబుతున్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు