Chiranjeevi: దయగుణంతో మరోసారి వార్తల్లో..

1978లో పునాది రాళ్ళూ సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా స్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా, తన సొంత టాలెంట్ తో ప్రేక్షకులను అలరించి ”మెగా స్టార్ ” అనిపించుకున్నాడు చిరంజీవి.

కొన్ని దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్న ఈ అగ్ర నటుడు కేవలం నటన లోనే కాదు, గుణం లో కూడా ప్రజల మనసు గెలుచుకున్నాడు. చిరంజీవి అంటే ఒక నటుడు మాత్రమే కాదు, ఎంతో మందికి సహాయం చేసి, ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన దేవుడు కూడా.

ఇటీవల చిరంజీవి మ‌రో సారి త‌న ఉదార‌త చాటుకున్నారు. కెమెరామెన్ దేవరాజ్ అంటే ఇప్పటి తరం వారికి తెలియక పోయిన 80, 90లలో అయన తెలియని వారు ఉండరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజిఆర్, రాజ్ కుమార్, రజినీకాంత్, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు, మురళీమోహన్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా ఎందరో హీరోలతో దేవరాజ్ వర్క్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన నాగు, పులిబెబ్బులి, రాణి కాసుల రంగమ్మ వంటి సినిమాలకు కెమెరామెన్ గా పనిచేసారు దేవరాజ్.

- Advertisement -

ఈయన కేవలం తెలుగులోనే కాకా తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ, బెంగాలీ భాషల్లో కూడా 300 కి పైగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా చేసారు. ఈయన ప్రస్తుతానికి ఆర్ధికంగా చాల ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ విషయాన్నీ ఒక యూట్యూబ్ ఛానల్ వెలుగులోకి తీసుకొచ్చింది.

ఇక దేవరాజ్ ఆర్ధిక పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి, క్షణం కూడా ఆలస్యం చేయకుండా 5 లక్షల రూపాయిలు ఇచ్చి ఆయనని ఆదుకున్నాడు. ఇదే కాకా, ఆయనని తన ఇంటికి పిలిచి, తనకి అండగా ఎప్పటికి ఉంటానని దేవరాజ్ కు ధైర్యం ఇచ్చాడు చిరంజీవి.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు