Chiranjeevi: ఆ స్టార్ హీరోయిన్ దెబ్బకు హాస్పిటల్ పాలు.. చిరు ప్లాన్ బెడిసి కొట్టిందా..?

Chiranjeevi.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. మెగా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన టాలీవుడ్ కి కమర్షియాలిటీని పరిచయం చేశారు.. ముఖ్యంగా సినిమా అంటే పాటలు, ఫైట్ లు, గ్లామర్, కామెడీ, ఎమోషన్స్ ఇలా అన్ని మేళవింపుతూ కూడుకున్న అంశాలను జోడించాలని.. అవే ప్రేక్షకులను మెప్పిస్తాయని తెలియజేసిన హీరోగా ఎదిగిన తర్వాత టాలీవుడ్ లో వచ్చిన సినిమాల పంథానే మారిపోయింది. ఇక ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఆయనే దీనికి కూడా కారణం అయ్యారని చెప్పవచ్చు. ఒక మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ మూవీస్ ఆకట్టుకోవడమే కానీ కామెడీతో కూడా మెప్పించాడు.. ఆయనలో మంచి హ్యూమర్ ఉంటుంది. ముఖ్యంగా తన మామ అల్లు రామలింగయ్య తో పాటు బ్రహ్మానందం ఆలీ వంటి వారితో కూడా కామెడీ చేసి అలరించారు చిరంజీవి.

Chiranjeevi: The star heroine was hit by the hospital.
Chiranjeevi: The star heroine was hit by the hospital.

చిరంజీవి పూర్తిస్థాయిలో కామెడీ చేసిన చిత్రం..

ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మాస్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను తెరకెక్కించిన చిరంజీవి పూర్తి కామెడీ ఫిలిం కూడా చేశాడు. చంటబ్బాయి అనే పూర్తిస్థాయి కామెడీ సినిమాతో వినోదాన్ని కూడా పంచారు.. ఇకపోతే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ పర్వాలేదు అనిపించుకుని అయితే ఇప్పుడు చూస్తే మాత్రం ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఫిలిం అని చెప్పవచ్చు. చార్లీ చాప్లిన్ స్టైల్ లో ఏజెంట్ గా చిరంజీవి చేసిన సందడి అంతా కాదని చెప్పాలి.. ఆయనకు తోడు సుహాసిని ఇన్నోసెంట్ బాగా కుదిరింది.. మొత్తం పూర్తిగా వర్కౌట్ అయిందని చెప్పవచ్చు.. 1986లో సుహాసిని, చిరంజీవి జంటగా జంధ్యాల రూపొందించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇందులో ఒక పాట మాత్రం హైలెట్గా నిలిచిందని చెప్పవచ్చు

సుహాసిని చేసిన పనికి హాస్పిటల్ పాలైన చిరంజీవి..

“అట్లాంటి ఇట్లాంటి హీరోను కాను” అంటూ చిరంజీవి చేసిన సందడి అంతా ఇంతా కాదు అని చెప్పాలి. ఈ నవ్వించే క్రమంలో ఆయనకు యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది. ఒక స్తంభంపై చిరంజీవి కూర్చున్నాడు.. దాన్నుంచి దుకాల్సి ఉంటుంది.. మొదటి దాన్ని పట్టుకున్న సుహాసిని ఆ తర్వాత వదిలేసి వెళుతుంది. కానీ ఆ స్తంభం కింద పడిపోయింది. దాంతోపాటు చిరంజీవి కూడా కిందపడి వెనుక భాగంలో గాయమైందట.. ఇక ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్లు సమాచారం. అయితే చిరంజీవి పడిపోయే సమయంలో సుహాసిని దాన్ని గమనించి.. ఆందోళనతో పరిగెత్తుతూ రియాక్ట్ అయిన తీరు ఆ పాటలో రియల్ గానే ఉంచారు.. కానీ ఆ సమయంలో చిరంజీవి సీరియస్ రియాక్షన్ ఇవ్వలేదు. అందుకే ఆ షాట్ ని ఆ పాటలో ఉపయోగించారు.. అలా సుహాసిని చేసిన పనికి చిరంజీవి హాస్పిటల్ పాలై అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఏది ఏమైనా యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన సినిమాలో రియల్ గా చూపించి అందరిని ఆశ్చర్యపరిచారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు