Ali : ఆ స్టార్ దర్శకుడు ఏం చెబితే అది చేసేస్తానంటున్న అలీ..!

స్టార్ కమెడియన్ అలీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నటించిన సినిమాల్లో ఆయన పండించే కామెడీతో పాటు ఆయన పలికే సంభాషణలు కూడా హైలెట్ అవుతుంటాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అలీ జోరు తగ్గింది. వెండితెర పై కంటే ఆయన బుల్లితెర పైనే ఎక్కువగా కనిపిస్తున్నారు. దీని గురించి అలీ ప్రస్తావిస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు.

అలీ మాట్లాడుతూ.. “ప్రస్తుతం బుల్లితెర పై ఒకే ఒక్క షో చేస్తున్నాను. అలాగే ‘యమలీల’ సీరియల్‌ కూడా చేశాను. ఎస్వీ కృష్ణారెడ్డి గారి కోసమే ఆ సీరియల్‌ చేశాను. ఎందుకంటే ఆయనే నన్ను హీరోని చేశారు. స్టార్‌ దర్శకుడిగా ఉన్న ఆయన..అందరినీ ఒప్పించి నాతో సినిమా చేశాడు. అందుకే ఆయన ఏం చెప్పినా.. వెనక ముందు ఆలోచించకుండా చేసేస్తాను. ఇక ఈ మధ్యకాలంలో నాకు చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్‌లు ఇస్తున్నారు.

సినిమా కథ ఏంటో మాకు చెప్పరు. తీరా సినిమా చూస్తుంటే..అలీ గారు ఎందుకు ఈ సినిమాలో నటించాడు? అని అందరు అనుకుంటారు. అభిమానులతో ఆ మాట అనిపించుకోవద్దనే కొన్ని సినిమాలు చేయడం లేదు. కథ విని నా క్యారెక్టర్‌ బాగుంటేనే సినిమా చేస్తా. కొత్త వాళ్ళు అయితే ఏదైనా పర్లేదు అని చేస్తారు. నాకు ఇప్పుడు ఆ అవసరం లేదు” అంటూ చెప్పుకొచ్చారు..!

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు