రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. చేసింది కొద్ది సినిమాలే అయినా.. స్టార్ హీరోలకు ధీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. ఆయన కేరీర్ లో అర్జున్ రెడ్డి, గీత గోవిందం మినహా.. దాదాపు అన్ని సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. అయినా స్టార్ డమ్ మాత్రం తగ్గలేదు. రౌడీ హీరోకు ఇంత ఇమేజీ ఉన్నా.. ఒక లోపం మాత్రం ఉంది. అదే టాలీవుడ్ సూపర్ స్టార్ ట్యాగ్.
అయితే ఈ లోపం.. లైగర్ సినిమాతో సెట్ అవుతుందని రౌడీ హీరో ఫ్యాన్స్ అంటున్నారు. పూరీ జగన్నాథ్ డైరెక్సన్ లో బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీపై భారీ గా అంచనాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ బాక్సర్ మైక్ టైసన్, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కూడా ఈ మూవీలో ఉండటంతో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టడం ఖాయమని తెలుస్తుంది.
అంచనాలకు అనుగూణంగానే.. ఈ మూవీ నుంచి అప్ డేట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటికే లైగర్ నుంచి వచ్చిన పోస్టర్స్ సినీ లవర్స్ ను కట్టిపడేశాయి. తాజా గా ఈ మూవీ నుంచి మరో అప్ డేట్ రానుంది. ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది.
ప్రస్తుతం ఓ ప్రోమోను కూడా ఫ్యాన్స్ ముందుకు తెచ్చింది. ప్రోమోలో బీజీఎం గుస్ బామ్స్ వచ్చేలా ఉంది. ఇక సాంగ్ వస్తే పునకాలే.
On
— Vijay Deverakonda (@TheDeverakonda) May 7, 2022
May 9th.
4 PM.#LIGERHunt pic.twitter.com/i7FOc82bol