PS : సీక్వెల్ పై క్రేజీ అప్డేట్

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగం ‘పిఎస్-1’ పేరుతో సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ మూవీగా నిలిచింది. ఇక తమిళంలో అయితే ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తూ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం, మొదటి భాగంతోనే చాలా వరకు రికవరీ చేసింది.

ఇది ఇలా ఉండగా, యూనివర్సల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కథ కొన్ని పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఉన్నా.. దాన్ని కన్వే చేయడంలోనే మేకర్స్ ఫెయిల్ అయ్యారు. పోన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 కి ఈ తప్పు జరగకూడదు అంటే హై లెవెల్ లో ప్రమోషన్స్ జరగాలి. ఈ విషయం అర్థం చేసుకున్న ‘లైకా ప్రొడక్షన్స్’ పోన్నియిన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు.

సగానికి పైగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న సెకండ్ పార్ట్ కోసం సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సమయంలో, బుధవారం సాయంత్రం నాలుగు గంటలకి పొన్నియిన్ సెల్వన్ అప్డేట్ ఇవ్వబోతున్నాం అంటూ లైకా ప్రొడక్షన్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారా? లేక ట్రైలర్ అప్డేట్ ఇస్తారా? లేక న్యూ ఇయర్ కి పోస్టర్ రిలీజ్ చేస్తారా? అనే విషయంలో మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు