Custody : కృతి శెట్టి ఫస్ట్ లుక్ విడుదల.

ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కస్టడీ. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. నాగ చైతన్య యొక్క ఫెరోషియస్ అవతార్ తో న్యూ ఇయర్ గిఫ్ట్ గా విడుదల చేసారు. ఆ గ్లిమ్ప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో కృతి శెట్టిని రేవతిగా పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది చిత్ర బృందం. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ లో కథని ముందుకి నడిపించే బలమైన పాత్ర లాగా ఆలోచన రేకెత్తించే లా కృతి శెట్టి కనిపించారు.

అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో శరత్కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.

అక్కినేని హీరో నాగ చైతన్య కెరీర్ లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది. మాస్ట్రో ఇళయరాజా మరియు అతని కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తుండగా, ఎస్ఆర్ కత్తిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
కస్టడీ ఈ సంవసరం మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ అవుతుంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు