Asha Parekh : దాదా ఫాల్కే

ప్ర‌ముఖ న‌టి ఆషా ప‌రేఖ్ ను 2020కి దాదా సాహెబ్ పాల్కే అవార్డుతో కేంద్ర ప్ర‌భుత్వం సత్క‌రించ‌నున్న‌ది. ఈ విష‌యాన్ని కేంద్ర స‌మాచార, ప్ర‌సార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగ‌ళ‌వారం త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. భారతీయ సినీ రంగంలోనే దాదా సాహెబ్ పాల్కే అత్యున్న‌త పుర‌స్కారం. సెప్టెంబ‌ర్ 30న భార‌త రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము విజ్ఞాన్ భ‌వ‌నంలో 79 ఏళ్ల ఆషా ప‌రేఖ్ కి ఈ అవార్డును అంద‌జేయ‌నున్నారు.

ఆశా ప‌రేఖ్ 1960-70ల‌లో బాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా ఉండేవారు. దిల్ దోకే దేఖో క‌టి ప‌తంగ్ తీస్రీ మంజిల్, కార‌వాన్ వంటి సినిమాల‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. 1990లో చివ‌రగా కోరా కాగ‌జ్ అనే టీవీ సీరియ‌ల్‌కి సైతం ద‌ర్శ‌క‌, నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు ప‌రేఖ్‌.

హిందీతో పాటు పంజాబీ, గుజ‌రాతీ, క‌న్న‌డ సినిమాల‌ను కూడా చేసి ఆమె సొంత నిర్మాణ సంస్థ‌ను స్థాపించింది. ఆమె స్థాపించిన నిర్మాణ సంస్థ‌లోనే టీవీ సీరియ‌ల్స్ ను నిర్మించింది. ఆశా ఇప్ప‌టివ‌ర‌కు 95కి పైగా చిత్రాల్లో న‌టించారు. 1998 నుంచి 2001 వ‌ర‌కు కూడా సెంట‌ర్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్ చైర్‌ప‌ర్స‌న్ గా వ్య‌వ‌హ‌రించారు. ఆ ప‌ద‌వీలో నియ‌మితులు అయిన మొట్ట‌మొద‌టి మ‌హిళా ఆశాప‌రేఖ్‌. 1992లో ఈమెకు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం ల‌భించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు