జయహో జై భీమ్

సూర్య తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ స్టార్ హీరో,
ఒకప్పుడు సూర్య సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ లభించేది ఈ మధ్యకాలంలో అది కాస్తా తగ్గుతూ వచ్చింది. ఈటీ సినిమా మినహాయిస్తే తన గత సినిమాలు రెండు ఓటిటి లోనే రిలీజ్ అయ్యాయి.
ఓటిటిలో రిలీజ్ అయినా ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన “ఆకాశమే హద్దురా” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, సూర్య కెరియర్ లోనే ఒన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అది. సూర్య ఆ సినిమాలో నటించిన తీరు కళ్ళలో నీళ్లు తెప్పించింది. ఆ సినిమాను ఇప్పుడు అక్షయ కుమార్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నారు.

ఆ తరువాత సూర్య చేసిన సినిమా “జై భీమ్”. జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శల ప్రశంసలు అందుకుంది. ఆస్కార్ రేసులో నిల్చున్న ఈ సినిమాకి ఆఖరి నిమిషాల్లో నామినేషన్ దక్కలేదు. కానీ ఈ సినిమాకి ఇప్పుడు ఒక అరుదైన గౌరవం దక్కింది. ప్రతి ఏడాది జరిగే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్ ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిగింది.

- Advertisement -

12వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ సినిమాగా జై భీమ్ నిలిచింది. అంతే కాక ఈ సినిమాలో నటించిన మణికందన్ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కూడా దక్కింది. అలానే అల్లరి నరేశ్‌ నటించిన నాంది సినిమా డైరెక్టర్ “విజయ్ కనకమేడల” కి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు