Dasara: ప్రకృతి నక్షత్రం[Natural Star] మరో అవతారం

శ్రీకాంత్ ఓదెల ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. బేసిక్ గా అన్నం ఉడికిందో లేదో తెలియాలి అంటే ఒక మెతుకు చూస్తే చాలు అంటారు. సరిగ్గా దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ కి ఈ మాటను అన్వయించవచ్చు. సుకుమార్ దగ్గర సినిమా పాఠాలు నేర్చుకున్న ఈ కుర్ర దర్శకుడు. గురువు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా ఈ చిత్రాన్ని మలిచాడు అని టీజర్, సాంగ్స్ ను చూస్తే చెప్పొచ్చు.

తాజాగా ఇప్పుడు రిలీజైన ట్రైలర్ తో అది మరో మారు రుజువైంది. ఈ దసరా ట్రైలర్ లో నేచురల్ స్టార్ నానిని రా గా, రస్టిక్ గా ప్రెజెంట్ చేసాడు శ్రీకాంత్. తెలంగాణ మట్టికథను 100 శాతం వెండితెరపై పరిచేసాడు అనిపిస్తుంది ఈ ట్రైలర్. ఆనాటి కాలానికి అలోవకగా తీసుకెళ్లి అద్భుతమైన అనుభూతిని కలిగించాడు శ్రీకాంత్. ట్రైలర్ లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది నాని పెరఫార్మన్స్. నేచురల్ స్టార్ నాని నెవెర్ బిఫోర్ లుక్ లో కనిపించి రచ్చ చేసాడు.

సినిమా మీద కొందరికి ప్రేమ ఉంటుంది, ఇంకొందరికి పిచ్చి ఉంటుంది. కానీ శ్రీకాంత్ మాత్రం పిచ్చికి పరాకాష్ట అనిపించేలా ఈ ట్రైలర్ ను ప్రెజెంట్ చేసాడు. షాట్స్, ఫ్రేమ్స్, విజువల్స్ అన్నింటిలో తనదైన మార్క్ ను చూపించాడు శ్రీకాంత్. దర్శకుడిగా ఇది శ్రీకాంత్ కి మొదటి సినిమా అంటే నమ్మశక్యం కాదు అనిపించేలా ఉంది. ముఖ్యంగా గోదావరిఖని ప్రాంతపు యాసను పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసాడు.

- Advertisement -

సంతోష్ నారాయణ్ బాక్గ్రౌండ్ స్కోర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. “పది తలకాయలు ఉన్నోడే ఒక్క తలకాయ ఉన్నోడి చేతిల సచ్చిండు పురాణాలని మించిన బ్రతుకులా మనయి ?” లాంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. నాని కెరియర్ లో ఇది బిగ్గెస్ట్ అవ్వబోతుంది అనే అంచనాలను క్రియేట్ చేస్తుంది ఈ దసరా మూవీ ట్రైలర్.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు