Dasara: ఆ యంగ్ డైరెక్టర్ సీక్రెట్ గా పెళ్లి చేసుకోడానికి కారణం ఏంటో తెలుసా ?

పెళ్లి అంటే లైఫ్ లో ఒకేసారి చేసుకునేది. అందుకే బంధువులు, స్నేహితుల మధ్యలో అందరు ఘనంగా వివాహం చేసుకోడానికి ఇష్టపడతారు. ఇక సెలెబ్రెటీలైతే డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పి తమ పెళ్లిళ్ల కోసం కోట్లకి కోట్లు ఖర్చుపెట్టి మరీ అందరికి గుర్తుండిపోయేలా పెళ్లి చేసుకుంటారు.

అయితే ఇందుకు భిన్నంగా ఒక టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మాత్రం ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా కొంత మంది స్నేహితులు, బంధువుల మధ్యలో సింపుల్ గా వివాహం చేసుకున్నాడు అది కూడా ఎవరికీ తెలియకుండా.

ఆ డైరెక్టర్ ఎవరా.. అని అనుకుంటున్నారా.. అతనే శ్రీకాంత్ ఓదెల. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా వచ్చిన దసరా సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమానే పాన్ ఇండియా సినిమా తెరకెక్కించిన ఈ యువ దర్శకుడు. ఫస్ట్ సినిమాతోనే వందకోట్ల మార్క్ టచ్ చేసిన డైరెక్టర్స్ క్లబ్ లో చేరిపోయాడు .

- Advertisement -

అయితే ఇంత గ్రాండ్ సక్సెస్ చుసిన ఈ యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చాలా ఇంట్రావర్ట్. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడాడు. దసరా సినిమా ప్రమోషన్స్ మరియు ఫంక్షన్స్ లో కూడా ఎక్కువగా హీరో నానినే సినిమా గురించే మాట్లాడేవాడు తప్ప శ్రీకాంత్ ఎక్కువ మాట్లాడిన దాఖలాలు లేవు

సినిమా 100 కోట్ల మార్క్ టచ్ చేసిన సందర్బంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో కూడా శ్రీకాంత్ మితంగానే మాట్లాడాడు. ఈ కారణంగానే శ్రీకాంత్ తనకి క్లోజ్ గా ఉండే, ఫ్రెండ్స్ ని, బంధువులని తప్ప ఇండస్ట్రీలో ఎవరికీ తెలియకుండా తన సొంత ఊరైన గోదావరిఖనిలో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ కొత్త జంటకి నాని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలపడంతో ఈ యంగ్ డైరెక్టర్ పెళ్లి తంతు అందరికి తెలిసింది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు