Dasara: అంతఃపురం చూడకుండా సినిమా ఎలా తీస్తావ్. ?

శ్రీకాంత్ ఓదెల ఈ పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. కేవలం ఒక్క దసరా సినిమాతో తెలుగు సినిమాలో హాట్ టాపిక్ అయ్యాడు శ్రీకాంత్. శ్రీకాంత్ తెరకెక్కించింది మాములు కథ అయినా, శ్రీకాంత్ ఆ సినిమాను తెరకెక్కించిన విధానం మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాను ఇంత అద్భుతంగా ఎలా తెరకెక్కించించాడు అనే ఆలోచనను రేకెత్తించాడు శ్రీకాంత్.

శ్రీకాంత్ ఈ సినిమాను రాగా, రస్టిక్ గా తెరకెక్కించాడు. దసరా సినిమా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బాక్గ్రౌండ్ స్కోర్ అన్ని ఆడియన్స్ కి ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ ను ఇచ్చి ధరణి ప్రపంచానికి, వీర్లపల్లి ఊరిలోకి తీసుకోపోయాయి. ఈ సుకుమార్ శిష్యుడు తన టాలెంట్ తో అందరిని ఆకట్టుకున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శ్రీకాంత్ కి ఒక ప్రశ్న ఎదురైంది. సుకుమార్ కాకుండా మీకు ఇన్స్పెర్ చేసిన ఇష్టమైన డైరెక్టర్స్ ఎవరు అంటే దానికి బదులుగా శ్రీకాంత్, దర్శకుడు కృష్ణ వంశీ పేరును చెప్పుకొచ్చాడు. తను ఇండస్ట్రీకి రాకముందు అంతపురం సినిమా చూడలేదట, శ్రీకాంత్ తండ్రి అంతఃపురం సినిమా చూడకుండా నువ్వు సినిమాలు ఎలా తీస్తావ్ అని అడిగితే, అంతఃపురం సినిమా చూశానని, దానిలో ఇంకా రా షార్ట్స్ ఉంటాయని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు, రాజమౌళి, పూరి జగన్నాద్ సినిమాలు కూడా తనకు ఇష్టమని చెప్పుకొచ్చాడు శ్రీకాంత్.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు