Dasara: మాస్ ట్రైలర్ రిలీజ్ కు రెడీ…

నాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా దసరా. ఇది నాని కెరీర్ లో భిన్నమైన సినిమా అని చెప్పొచ్చు. తెలంగాణలోని గోదావరిఖనిలో గల సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

శ్రీకాంత్ ఓదెల కి రంగస్థలం లాంటి సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ ల పని చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవం ఇప్పుడు దసరా సినిమాలో చూపించే అవకాశం ఉంది. అది ఇప్పటి వరకు రిలీజ్ అయినా టీజర్ , పాటలతో తెలుస్తోంది. టీజర్ తో పాటు మూడు సాంగ్స్ ఊరా మాస్ లెవెల్ లో వున్నాయి. టీజర్ అయితే పాన్ ఇండియా లెవెల్ లోనే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే భారీ అంచనాలు క్రియేట్ చేసాయి.

హైప్ ను మరింత పెంచడానికి మూవీ టీం కూడా ప్లాన్స్ చేస్తోంది. అందులో భాగంగా దసరా మూవీ టీజర్ పాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అందుకు వేదికగా లక్నో నగరాన్ని సెలక్ట్ చేసుకున్నారు. నిజానికి ట్రైలర్ కు సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాలేదట. కానీ, హీరో నాని తాను అనుకున్న సమయానికే ట్రైలర్ విడుదల చేయాలని, అందుకు అనుకూలంగా పనులను పూర్తి చేయాలని డైరెక్టర్ ను ఆదేశించారని సమాచారం.

- Advertisement -

ఈ నేపథ్యంలో తాజాగా మూవీ యూనిట్ నుంచి ట్రైలర్ పై అధికారిక ప్రకటన వచ్చింది. దసరా ట్రైలర్ ను ఈ నెల 14న అన్ని భాషల ప్రేక్షకులను అలరించడానికి ప్రేక్షకుల ముందుకి రాబోతుందని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఇన్ని అద్భుతాలు సృష్టించిన ఈ సినిమా ఇంకెంత హైప్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు