Dasara: లీకైన స్టోరీ.. నాలుగు పాత్రల చుట్టూ కథంతా..

నేచురల్ స్టార్ నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న మొదటి మూవీ ఈ దసరా. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని, మార్చి 30న విడుదలకు సిద్ధంగా ఉంది. అందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్దం అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. హీరో నాని విభిన్న రకాలుగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాడు. చిత్ర ట్రైలర్ ను లక్నోలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల వైజాగ్ లో ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ లోనూ నాని మెరిసాడు. అక్కడ కూడా తన దసరా మూవీకి ప్రమోషన్స్ చేశాడు.

దీంతో పాటు సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన పాటలు, టీజర్, ట్రైలర్ అంచనాలను భారీగా పెంచాయి. దీంతో దసరాలో అంతలా ఏం ఉంది ? కొత్త డైరెక్టర్ ఎలా తెరకెక్కించాడు ? అసలు ఎలాంటి కథ ఉంది ? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

అయితే ప్రస్తుతం దసరా మూవీ స్టోరీ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. దీని ప్రకారం.. సినిమా ఫ్రెండ్ షిప్ కు సంబంధించినది అని తెలుస్తోంది. హీరో ధరణి(నాని).. అతని ఫ్రెండ్ ఒకే అమ్మాయిని ప్రేమిస్తారట. ఆ అమ్మాయే వెన్నెల(కీర్తి సురేష్). కానీ, చివరికి వెన్నెలను ధరణి కాకుండా, ధరణి ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటరని తెలుస్తోంది. ఈ క్రమంలో వెన్నెలపై విలన్ మనసు పడుతాడట.

- Advertisement -

ఈ నేపథ్యంలో విలన్ చేతిలో వెన్నెల, ధరణి ఫ్రెండ్ చనిపోతారని సమాచారం. దీంతో విలన్ పై హీరో నాని (ధరణి) రీవేంజ్ తీసుకుంటారని తెలుస్తోంది. అంటే సినిమా మొత్తం హీరో, హీరోయిన్, విలన్, హీరో ఫ్రెండ్ చుట్టూనే ఉంటుందని గుస గుసలు వినిపిస్తున్నాయి.

అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలపై తన గురువు సుకుమార్ ప్రభావం కూడా ఉందట. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య2 సినిమాను దసరా కొంత మేరకు గుర్తు చేస్తుందని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఇది నిజమో కాదో.. తెలియాలంటే మార్చి 30 వరకు వెయిట్ చేయాల్సిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు