18Pages : ఫస్ట్ లిరికల్ కు డేట్ ఫిక్స్

నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రం “18 పేజిస్”. ఇప్పటికే వీళ్లు కార్తికేయా-2లో కనిపించిన విషయం తెలసిందు. ఇప్పుడు రెండో సినిమాలో కనిపించబోతున్నారు. GA2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇదివరకే రిలీజైన ఈ చిత్ర టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం రోజురోజుకు థియేటర్స్ ను, కలక్షన్స్ ను పెంచుకుంటూ తిరుగులేని విజయాన్ని సాధించింది.

కృష్ణ తత్వాన్ని, కృష్ణ సారాంశాన్ని చెప్పిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలక్షన్స్ సాధించింది. అంతటి ఘనవిజయం సాధించిన కార్తికేయ- 2 తరువాత అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ జంటగా చేస్తున్న చిత్రం కావడంతో ఈ “18 పేజిస్” సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాాన్ని డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నాస్టాల్జిక్ రొమాన్స్‌ని పుష్ప దర్శకుడు సుకుమార్ రాశారు. ఇదివరకే గతంలో కుమారి 21 ఎఫ్ చిత్రంతో హిట్ అందుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

“18 పేజిస్” చిత్రం నుండి విడుదలకాబోయే సాంగ్ అప్డేట్ ను అధికారికంగా ప్రటించారు మేకర్స్. ఈ చిత్రం నుండి “నన్నయ్య రాసిన” అనే లిరికల్ వీడియో సాంగ్ ను నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు