Deepika Padukone : మ‌ళ్లీ అలా..

బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకొణె ఇటీవ‌లే అస్వ‌స్థ‌త‌కు గురైన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఆమె అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఒంట్లో తీవ్ర అసౌక‌ర్యం క‌ల‌గ‌డంతో  మంగ‌ళ‌వారం రాత్రి  ఆమె  ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో  చేరారు. ముఖ్యంగా శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డుతున్న‌ట్టు వైద్యులు గుర్తించారు. ఆమెకు అవ‌స‌ర‌మైన ప‌లు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దీపికా ఆరోగ్యం గురించి అస‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

కొద్ది రోజుల కింద‌ట హైద‌రాబాద్ లో ప్ర‌భాస్ సినిమా ప్రాజెక్ట్- కె షూటింగ్‌కి వ‌చ్చిన స‌మ‌యంలో ఆమె అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆ స‌మ‌యంలో ఆమె గుండె వేగంగా కొట్టుకోవ‌డంతో హైద‌రాబాద్ కామినేని ఆసుప‌త్రి వైద్యులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ప‌ని ఒత్తిడి కార‌ణంగా ఆరోగ్యం దెబ్బ‌తింద‌ని డాక్ట‌ర్లు ధృవీకరించారు. కొద్ది నెల‌ల కింద‌టే దీపిక‌కు క‌రోనా సోకింది. క‌రోనా నుంచి కోలుకున్న త‌రువాత యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది. ఆ ట్రిప్ నుంచి తిరిగి వ‌చ్చిన త‌రువాత ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు.

తాజాగా మ‌రోసారి దీపిక ఆసుప‌త్రి పాల‌వ్వ‌డంతో అభిమానుల్లో కాస్త ఆందోళ‌న నెల‌కొంది. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ప్రాజెక్ట్ -కె సినిమాలో ప్ర‌భాస్‌కి జోడిగా దీపిక న‌టిస్తున్నారు. షారూఖ్ ఖాన్ ‘ప‌ఠాన్’ మూవీలో కూడా ఆమె హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రోవైపు హృతిక్ రోష‌న్ స‌ర‌స‌న ‘ఫైట‌ర్’ చిత్రంలో కూడా దీపిక హీరోయిన్ న‌టించ‌నుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు