Deepika Padukone : రెండు సినిమాలపై హైప్ ను పెంచింది

బాడ్మింటన్ ను వదిలి మోడలింగ్ నీ కెరీర్ గా ఎంచుకొని తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది దీపికా పదుకొనె. కన్నడ స్టార్ హీరో ఉపేంద్రా నటించిన ‘ఐశ్వర్య’ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ‘ఓం శాంతి ఓం’ సినిమాతో బాలీవూడ్ లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఈ సినిమా హిట్ కావడంతో వరుస సినిమాలతో ఇప్పటికీ బిజీ గానే గడుపుతుంది. తన నటన మరియు డాన్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ పొడువు కాళ్ల సుందరి.

ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యంత రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ లలో దీపికా మొదటి స్థానంలో ఉంది. వరుస సినిమాలతో బ్రేక్ లేకుండా పని చేస్తున్న దీపికా పాడుకొనే ఇవాళ తన 37వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్బంగా తాను నటిస్తున్న సినిమాల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

షారుఖాన్ హీరోగా యాష్ రాజ్ ఫిలిమ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పఠాన్. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి దీపికా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో దీపిక గన్ పట్టుకొని చాలా సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ లుక్ ను చూస్తే, పఠాన్ లో దీపికా క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

అలాగే ప్రాజెక్ట్ K సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టబోతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ప్రభాస్ కు జంటగా దీపికా నటిస్తున్నారు. ప్రాజెక్ట్ K సినిమా నుంచి ఈ స్టార్ హీరోయిన్ బర్త్ డే సందర్బంగా పోస్టర్ ను రిలీజ్ చేసారు. చీకటి లో వెలుగు ను తెప్పించే పాత్రలో దీపిక నటుస్తునట్టు మూవీ యూనిట్ ఈ పోస్టర్ లో చెప్పారు. దీన్ని చూస్తే ప్రాజెక్ట్ K లో దీపిక పాత్ర చాలా పవర్ ఫుల్ గా, సినిమాలో మలుపు తిప్పే విధంగా ఉంటుందని అర్థమవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు