Devara: దేవర మూవీపై దుష్ప్రచారం.. మేకర్స్ అలర్ట్ కావాల్సిందే..?

Devara.. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పటికే వేరువేరు కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోని మొన్న ఈ సినిమా షూటింగ్ ఆగిపోగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులను ఈ విషయం ఎంతగానో బాధపెట్టిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మళ్లీ వాయిదా పడింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో మేకర్స్ ప్రచారం విషయంలో వెంటనే అప్రమైతే మంచిది.. లేకపోతే రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Devara: Bad publicity on Devara movie.. Makers should be alerted..?
Devara: Bad publicity on Devara movie.. Makers should be alerted..?

రూ.300 కోట్లు బడ్జెట్ తో సినిమా..

ఇకపోతే దేవరా సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఇందులో మొదటి భాగం ఆలస్యం అయితే రెండవ భాగం ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి… ఇప్పటికీ దేవరా సినిమా షూటింగు దాదాపు పూర్తయింది. ఇక రిలీజ్ వాయిదా పడే అవకాశాలు దాదాపుగా లేనట్టే అని ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యంగా యాక్షన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని, మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని సమాచారం.. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో సముద్ర తీర ప్రాంతపు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఇక దేవరా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే..

దేవర మూవీపై దుష్ప్రచారం..

ఇందులో ఎన్టీఆర్ తండ్రి కొడుకుల పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్క్రిప్ట్ కోసం కొరటాల శివ ఎంతో కష్టపడి పనిచేశారు. దేవరా సినిమా సెకండ్ సింగిల్ అతి త్వరలోనే విడుదల కాబోతోంది. ఇక అందుకే దేవర సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని కచ్చితంగా హిట్ అందుకుంటుందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఆగిపోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఇలాంటి రూమర్స్ మరింత స్ప్రెడ్ కాకుండా నిర్మాతలు త్వరగా అలర్ట్ అవ్వాలని.. ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టాలని అభిమానులు కోరుతున్నారు.. మరి ఏ మేరకు ఈ సినిమా పై వస్తున్న దుష్ప్రచారాన్ని మేకర్స్ అడ్డుకుంటారో చూడాలి.

- Advertisement -

ఎన్టీఆర్ సినిమాలు..

ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా పూర్తయిన వెంటనే కేజీఎఫ్ సినిమాలతో సంచలనం సృష్టించిన ప్రముఖ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.. మరొకవైపు ఈ సినిమా తర్వాత మరో యంగ్ డైరెక్టర్ కి అవకాశం ఇస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ఇకపోతే దేవర సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది.. మరి రెండవ భాగంలో ఈమెనే కంటిన్యూ చేస్తారా లేక హీరోయిన్ ని మార్చే అవకాశాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు