Sir : కాస్త లేటు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులను టార్గెట్ గా చేస్తున్న చిత్రం సార్. ధనుష్ తమిళ సినిమాలు తెలుగులో డబ్ అవడం వల్ల ఇక్కడ కూడా ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్, మారి సినిమాలు తెలుగులోనూ మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. దీంతో ధనుష్ మార్కెట్ ను తెలుగులో విస్తరించాలని ప్లాన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ ధనుష్ సార్ సినిమాతో వస్తున్నాడు. ఇది తమిళంలో వాతి పేరిట రూపొందుతోంది.

ధనుష్ తన కెరీర్ లో మొదటిసారి పాఠాలు చెప్పే మాస్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కాగా మొదట ఈ సినిమాని డిసెంబర్ 2న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు మరో ప్రకటన చేశారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. 2023 ఫిబ్రవరి 17న సినిమా విడుదల చేస్తున్నట్లు కొత్త పోస్టర్ ని అధికారికంగా విడుదల చేసింది చిత్ర యూనిట్.

సితారా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ధనుష్ కు మొదటి స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్. ఇక టీజర్ బట్టి చూస్తే, చదువుని వ్యాపారం చేసి అమ్ముతున్న వ్యవస్థను ప్రశ్నించేలా ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ మూవీ ధనుష్ కి తెలుగులో మొదటి విజయాన్ని అందించగలదో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు