Naga Chaitanya : విజయ్ పాత్రను కొట్టేశాడా?

విజయ్ సేతుపతి.. కోలీవుడ్, టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. హీరో, విలన్ పాత్రలతో మంచి గుర్తింపు పొందాడు. సాధరణంగా ఒక హీరో.. విలన్ పాత్రలు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ విజయ్ సేతుపతి మాత్రం విలన్ పాత్రలు అయినా, స్టోరీ నచ్చితే ఇతర పాత్రలు కూడా చేయడానికి ముందుకు వస్తాడు. ఇటీవల కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి ఎంత అద్భుతంగా నటించాడో అందరూ చూశారు. ఇప్పటికి కూడా విజయ్ సేతుపతి పాత్ర స్టైల్ ను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు నెటిజన్లు.

అందుకే విజయ్ సేతుపతికి ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. అలా అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చడ్డా లోనూ ఒక పాత్రకు విజయ్ సేతుపతిని ఎంపిక చేశారట. కానీ, చివరికి ఆ పాత్రలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్యను ఫైనల్ చేశారు. కాగా నాగ చైతన్య ఈ చిత్రంలో బాలరాజు అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం ఆగస్టు11న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. మూవీ టీం కూడా ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే నాగ చైతన్య ఇటీవల ఒక మీడియాతో మాట్లాడుతున్న సమయంలో బాలరాజు పాత్రలో ముందుగా విజయ్ సేతుపతిని ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి అది నిజమేనా అని అడిగారు. దానికి చైతన్య.. బాలరాజు పాత్రలో ముందుగా విజయ్ సేతుపతినే తీసుకున్నారని చెప్పారు. కానీ, ఎందుకు తప్పుకున్నాడో తనకు తెలియదని పేర్కొన్నారు. డేట్స్ అందుబాటు కాక ఈ సినిమాలో నటించలేదేమో అని తెలియజేశారు. బాలరాజు పాత్రను ముందుగా విజయ్ సేతుపతి బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగానే డిజైన్ చేశారని, కానీ తర్వాత తాను వచ్చిన తర్వాత తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా బాలరాజు పాత్రలో మార్పులు చేశారని వివరించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు