Dil Raju:పవన్, మహేష్ సినిమాలతో చాలా నష్టపోయా.

తెలుగు సినీ ప్రేక్షకులకి దిల్ రాజు పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. చిన్న డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం పెద్ద నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. నిర్మాతగా ఇండస్ట్రీలో అంచెలంచలుగా ఎదుగుతూ ఏకంగా పాన్ ఇండియా స్థాయి సినిమాలను.. భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో స్టార్ నిర్మాతగా కొనసాగుతున్నారు దిల్ రాజు.

డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా దిల్ రాజుకి మంచి అనుభవం ఉంది. ఏ కథ ఏ వర్గం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనేది ఆయనకి బాగా తెలుసు.కథల విషయంలో దిల్ రాజు జడ్జిమెంట్ చాలా వరకు కరెక్ట్ గా ఉంటుందని అంటారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు ఓ రెండు సినిమాల వల్ల చాలా నష్టపోయానని చెప్పారు.

ఆయన ఎంచుకున్న ఈ రంగంలో అప్పటికి తనకి అవగాహన లేదని.. అనుభవం వచ్చేలోగా చాలా నష్టపోయానని చెప్పుకొచ్చారు.ఆ సినిమాలు మరేవో కాదు మహేష్ బాబు స్పైడర్, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి.

- Advertisement -

ఈ ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. ” నేను చాలా మొండివాడిని. ఒక ప్రొడ్యూసర్ గా ఎక్కడి వరకు అయినా వెళ్లి రిస్క్ చేస్తాను. అయితే ఇక్కడ చాలా పోటీ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక సినిమా ఆడుతుందా లేదా అనేది జడ్జ్ చేసేవాడే మగాడు. అలా ఈ సినిమాను మనం తీసుకోవచ్చు అని నేను జడ్జ్ చేస్తుంటాను. అలా తీసుకున్న నిర్ణయాలు ఒక్కోసారి మిస్ ఫైర్ కూడా కావచ్చు అని తెలిపారు .

అలా జరిగినవే స్పైడర్, అజ్ఞాతవాసి. ఈ రెండు సినిమాలు డిస్ట్రిబ్యూటర్ గా నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డ్యామేజ్. అయినప్పటికీ నేను తట్టుకొని నిలబడ్డాను. ఆ సమయంలో వరుసగా సక్సెస్ లు చూడడం వలన వచ్చిన డబ్బు ఇక్కడ పోయింది. అందువలన బ్యాలెన్స్ అయింది. వందల కోట్ల బడ్జెట్లో నేను సినిమాలు చేయడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. రిస్క్ చేయడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను ” అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు