Varasudu: రాజు గారి నిశ్శబ్దం

బండిని నుంచి వచ్చే పొగను చూసి ఏ బంకు లో పెట్రోల్ కొట్టావో చెప్పేస్తానురా అంటాడు మన్మధుడు సినిమాలో బంకు శీను. అలానే సినిమా కథను, సినిమాను చూసి దాని భవిష్యత్ ఏంటో చెప్పగలరు నిర్మాత దిల్ రాజు. అలా అని దిల్ రాజు పట్టిందంతా బంగారం కాదు, పప్పులో కాలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

వీటిలో ముందు గుర్తొచ్చేది తమిళంలో సూపర్ హిట్ 96 సినిమాను జానుగా తెలుగులో తియ్యడం. అదే డైరెక్టర్ తో సినిమాను చేయించిన అది ఆర్టిఫీషియల్ గా ఉంది తప్ప హార్ట్ ఫుల్ గా లేదు. అప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు దిల్ రాజ్. ఇండస్ట్రీ లో దిల్ రాజ్ జెడ్జిమెంట్ పై అందరికి మంచి నమ్మకం ఉంది. మున్నా సినిమా రిలీజైన మొదటి రోజే ప్రభాస్ ఇంటికి వెళ్ళి సారీ చెప్పడం ఆయనకు మాత్రమే చెల్లింది.

తెలుగులో ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్ టాలెంట్ గుర్తించి ఆయన అవకాశాలు ఇచ్చాడు. అలా ఇవ్వడం బట్టే ఒక ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం లాంటి మంచి సినిమాలు వచ్చాయి. వాస్తవానికి ఇప్పుడు ఆ బ్యానర్ లో ఇటువంటి సినిమాలు రావడం లేదు. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయింది ఇప్పుడు దిల్ రాజ్ బ్యానర్.

- Advertisement -

ఇకపోతే ఒకప్పుడు తెలుగు సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చే రాజు గారు ప్రస్తుతం తమిళంలో సినిమాలను నిర్మిస్తున్నాడు, అదే సినిమాను తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలకు తెలుగు సినిమా తర్వాతే ప్రాధాన్యత అన్న దిల్ రాజు ఇప్పుడు స్వయంగా డబ్బింగ్ సినిమాకు ఎక్కువ ప్రధాన్యత ఇవ్వడంతో తెలుగు సినిమా నిర్మాతల సంఘం ఆగ్రహంతో రీసెంట్ గా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది.

దేనికైనా వెంటనే స్పదించే రాజు గారు ఈ విషయంలో మాత్రం నోరు తెరవడం లేదు. లేదంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళతో రహస్యంగా చర్చలు జరిపారా. ? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న ఈ తరుణంలో రాజు గారు స్పదించకుండా నిశ్శబ్దంగా ఉండటం సరికాదని తెలుగు సినిమా నిర్మాతల అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు