Dilraju: “సర్కారు వారి పాట” నా థియేటర్స్ లో వద్దు

దిల్ రాజ్ ఒకప్పుడు సక్సెస్ ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.
దిల్ రాజ్ బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే చాలు బాగానే ఉంటుంది అనే నమ్మకంతో సినిమాకి వెళ్లిపోవచ్చు.
డిస్ట్బ్యూటర్ గా కెరియర్ మొదలు పెట్టిన దిల్ రాజ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో అగ్ర నిర్మాతగా ఎదిగారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో అద్భుతమైన సినిమాలను నిర్మించి తమ బ్యానర్ కి ఒక వేల్యూ ను తీసుకునివచ్చారు.

అప్పట్లో వచ్చిన దిల్, ఆర్య , బొమ్మరిల్లు , కొత్త బంగారు లోకం, బృందావనం లాంటి ఎన్నో గొప్ప సినిమాలను నిర్మించిన దిల్ రాజ్ ఈ మధ్యకాలంలో ఆ స్థాయి సినిమాలను నిర్మించలేకపోయారు. ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ అంతంత మాత్రంగానే ఆడుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో నిర్మించిన వకీల్ సాబ్ తో మంచి లాభాలనే అందుకున్నారు దిల్ రాజ్.

ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అందరితో సినిమాలు నిర్మించారు దిల్ రాజు.
అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” . అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన “సరిలేరు నీకెవ్వరు” తో హిట్స్ అందుకున్న దిల్ రాజు. నిన్న రిలీజైన “సర్కారు వారి పాట” కు మాత్రం ఉత్తరాంధ్రలో తనకున్న థియేటర్స్ లో ఈ సినిమాకి అనుమతి ఇవ్వలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు