Ajay Bhupathi: అజయ్‌ది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా.?

ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అజయ్ భూపతి. రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన అజయ్ భూపతి తన మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించాడు. ఆర్ఎక్స్ 100 సినిమా మొదటి రిలీజ్ అయినప్పుడు మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మిక్సిడ్ టాక్ వచ్చింది. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు.

ఈ సినిమా సాంగ్స్ తో పాటు హీరోయిన్ క్యారెక్టర్ యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా తర్వాత అజయ్ భూపతికి వరుస అవకాశాలు వచ్చాయి. రవితేజ నాగచైతన్య వంటి హీరోలకు కూడా అజయ్ భూపతి కథను చెప్పాడు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల వారిద్దరూ ఆ సినిమాను చేయలేదు. ఆ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ సిద్ధార్థ కలిసి నటించిన సినిమా “మహాసముద్రం”. ఈ సినిమా మంచి అంచనాలతో విడుదలైంది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేదు.

ఆ సినిమా తర్వాత ప్రస్తుతం అజయ్ భూపతి చేస్తున్న సినిమా మంగళవారం. ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ అలానే ట్రైలర్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కంటెంట్ కూడా కొత్తగా ఉండబోతుందని అర్థమవుతుంది. ఈ సినిమాకి కాంతారా ఫ్రేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అజయ్ భూపతి ఈ సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు.

- Advertisement -

ఆడియన్స్ కి హార్ట్ బీట్ పెరిగి థియేటర్స్ లో పూనకాలు వస్తాయని చెప్పి సినిమాపై తన నమ్మకాన్ని తెలిపాడు అజయ్ భూపతి.ఇది ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా అంటూ చెప్పుకొచ్చాడు అజయ్. మరి ఇది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అని తెలియాలి అంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. మహాసముద్రం సినిమాతో ఓటమినందుకున్న అజయ్ భూపతి ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోక తప్పదు. మంగళవారం సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు