Lokesh : ఏం క్రేజ్ గురు..

సాధారణంగా ఒక యాక్టర్ కు గానీ, ఒక సింగర్ కు గానీ, ఒక దర్శకుడికి గానీ అభిమానులు అంత ఈజీగా రాలేరు. ఎదో ఒక అద్భుతం చేసి ఉండాలి. లేదా పదుల సంఖ్యలో సినిమాలు చేసి అయినా ఉండాలి. కొంత మంది సెలబ్రెటీలు అయితే పదుల కొద్ది సినిమాలు చేసినా.. పెద్దగా గుర్తింపు తెచ్చుకోవడం లేదు. హీరోలు అయితే ఒక ఐదు సినిమాల్లో కనిపిస్తే.. హీరో కదా.. అని ఒక గుర్తింపు ఉంటుంది. కొంత వరకు ఫ్యాన్స్ ఉంటారు. అదే డైరెక్టర్లుకు ఫ్యాన్స్ ఉంటారా ? అంటే.. కొన్ని రోజుల క్రితం అసలు ఇలాంటి ప్రశ్న కూడా వచ్చేది కాదు.

కానీ, తెరమీద కనిపించే హీరోలకు మాత్రమే ఆదరణ లభించే రోజుల్లో.. శివ సినిమాతో దర్శకులకు కూడా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఈయన తర్వాత పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ లాంటి దర్శకులు కూడా కొంత వరకు ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. “బాహుబలి” సినిమా తర్వాత అంతర్జాతీయ స్థాయిలో జక్కన్న గుర్తింపు పొందాడు. అయితే ఈ దర్శకులకు ఇప్పుడున్న ఫ్యాన్ బేస్ రావడానికి చాలా కాలం పట్టింది. కానీ ఇప్పుడు ఒక యంగ్ డైరెక్టర్ మాత్రం పెద్దగా సినిమాలు చేయకుండానే స్టార్ డైరెక్టర్ రేంజ్ కు వెళ్లిపోయాడు. అతనేవరో కాదు.. కోలీవుడ్ డైరెక్టర్, పాన్ ఇండియా సెన్సెషన్ లోకేష్ కనగరాజ్.

చేసింది నాలుగు అంటే నాలుగే సినిమాలు. నాలుగు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. చిన్నగా వచ్చిన “నగరం” మూవీ కోలీవుడ్ ను షేక్ చేసింది. తర్వాత వచ్చిన “ఖైదీ” “మాస్టర్” “విక్రమ్” భారతీయ సినీ పరిశ్రమనే ఊపేశాయి. మన దేశంలో ఇప్పటి వరకు చేయలేని సినిమాటిక్ యూనివర్స్ ను ఈ యంగ్ డైరెక్టర్ క్రియేట్ చేశాడు. దీంతో హాలీవుడ్ నుంచి కూడా ఈ సెన్సెషన్ డైరెక్టర్ కు ప్రశంసలు వచ్చాయి.

- Advertisement -

ఇప్పుడు ఈ కుర్ర డైరెక్టర్ క్రేజ్ ఎంత ఉందంటే.. కొన్ని నెలల క్రితం సినిమా పనుల్లో భాగంగా తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్టు తెలిపాడు. ఆ ట్వీట్ కొన్ని రోజుల పాటు ట్రెండింగ్ లో ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్న కోలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 6 కు సంబంధించిన ఒక పోస్టును విజయ్ టీవీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీనికి లోకేష్ తన ట్విట్టర్ లో స్పందిస్తూ ఒక లైక్ ఇచ్చాడు.

ఈ ఒక లైక్ తో మళ్లీ ట్విట్టర్ ట్రెండింగ్ లోకి వచ్చాడు లోకేష్ కనగరాజ్. “బాస్ ఈజ్ బ్యాక్” “తలా ఈజ్ బ్యాక్” అంటూ లోకేష్ కు ఫ్యాన్స్ వెల్ కమ్ చెబుతున్నారు. సాధారణంగా సోషల్ మీడియాలో ఇలాంటి పరిస్థితులు కనిపించవు. కానీ లోకేష్ కు ఫ్యాన్స్ ఇలా బ్రహ్మరథం పట్టడం కొంత వరకు ఆశ్చర్యానికి గురి చేసినా.. వాటికి అతడు అర్హుడు అని చెప్పొచ్చు. ఏది ఏమైనా.. ఒక నాలుగు సినిమాలు చేసిన వ్యక్తికి ఇంత క్రేజ్ ఉండటం సాధారణ విషయం కాదు.

కాగా లోకేష్ ప్రస్తుతం తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఖైదీ-2, విక్రమ్-2 తో పాటు విజయ్ తో థలపతి67 సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలపై ఒక కోలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి.

Lokesh Kanagaraj
Lokesh Kanagaraj

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు