NTR : ఎన్టీఆర్ తో ఇండస్ట్రీకి పరిచయమైన డైరెక్టర్లు ఎవరో తెలుసా.?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పెద్ద స్టార్ హీరో. కానీ ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో అతనికి ఫ్యామిలీ సపోర్ట్ లేదు. నందమూరి ఫ్యామిలీ అంతా ఇతన్ని దూరంగా ఉంచింది. ఆ టైములో తన స్వశక్తితో పైకొచ్చాడు ఎన్టీఆర్. సినిమాల్లో కనుక క్లిక్ అవ్వకపోతే మేకప్ బాయ్,లైట్ బాయ్ గా అయినా ఇండస్ట్రీలో కొనసాగుతాను అని చెప్పుకొచ్చాడు.

అతని టాలెంట్,హార్డ్ వర్క్ వల్లే అతను ఈరోజున ఇలా ఉన్నాడు. ఎన్టీఆర్ టాలీవుడ్ కు కొంతమంది దర్శకులను కూడా పరిచయం చేసాడు. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఎన్టీఆర్ టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకులు ఎవరో తెలుసా :

1)రాజమౌళి : ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రంతో దర్శకుడిగా మారాడు.

- Advertisement -

2) వి.వి.వినాయక్ : ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’ చిత్రంతో దర్శకుడిగా మారాడు.

3)డి.కె. సురేష్ : ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నాగ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.

4)వర ముళ్ళపూడి : ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నా అల్లుడు’ చిత్రంతో దర్శకుడిగా మారాడు.

5) మెహర్ రమేష్ : ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘కంత్రి’ చిత్రంతో దర్శకుడిగా మారాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు