Divi Vadthya : ఇష్టపడి చేస్తే తప్పేంటి

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఫేమస్ అయిన వారు చాలా మందే ఉన్నారు. అందులో దివి వద్యా ఒకరు. బిగ్ బాస్ తెలుగు 4 హౌజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత సూపర్ పాపులర్ అయింది దివి. అయితే ఈమె మహర్షి సినిమాతో పాటు పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా మంచి పేరుని సంపాదించుకుంది. ఫైనల్స్ కి చేరిన దివిని మెగాస్టార్ చిరంజీవి కూడా పొగిడేశారు.

అంతే కాదు ఈ బ్యూటీకి తన సినిమాలో అవకాశం కూడా ఇస్తానని మాటిచ్చాడు. మాట ఇచ్చినట్లుగానే గాడ్ ఫాదర్ మూవీ లో అవకాశం ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఈమె పలు వెబ్ సిరీస్, టీవీ షోలో, అటు సినిమాలలో నటిస్తూ తన అందచందాలతో కేక పెట్టిస్తోంది. అంతే కాదు.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. ఈమెకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి.. కాస్టింగ్ కౌచ్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మన ప్రవర్తనను బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారని చెప్పింది. ఇక ఒక అమ్మాయిని అబ్బాయి ఇష్టపడి కమిట్ అవ్వడంలో తప్పేమీ లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వారిద్దరికీ ఇష్టం ఉన్నప్పుడు అది తప్పు కాదని అభిప్రాయపడింది. ఇలా ఇండస్ట్రీలో చాలామంది కమిట్ అవుతున్నారని చెప్పుకొచ్చింది దివి. ఈ బిగ్ బాస్ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు