Divyansha Kaushik : ఆశలన్నీ ‘రామారావు’ పైనే !

నాగచైతన్య హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘మజిలీ’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2019 వ సంవత్సరంలో సమ్మర్ కానుకగా విడుదలైన ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. సమంత నటన ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది అని చెప్పొచ్చు. ఈ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్. ‘మజిలీ’ లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. దివ్యాంశ లుక్స్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం తర్వాత తెలుగులో బిజీ అయిపోతుందని అంతా భావించారు.

కానీ అలా జరగలేదు. దానికి ప్రధాన కారణం ఈ చిత్రంలో దివ్యాంశ పాత్రను బాగా తగ్గించడమే అని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ విషయం పక్కన పెడితే, దివ్యాంశ మూడెళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రవితేజ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో ఓ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో దివ్యాంశకు ఎంతవరకు ప్రాముఖ్యత ఉంది. ఈ పాత్ర ఎంత వరకు కలిసొస్తుంది. అనే ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి.

‘రామారావు ఆన్ డ్యూటీ’ పై దివ్యాంశ ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ సినిమా హిట్ అయితే మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు