Tollywood: సాయి పల్లవి డాన్స్ ఎలా నేర్చుకుందో తెలుసా?

సాయి పల్లవి… ఈమె గురించి టాలీవుడ్ లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలెంటెడ్ నటి అయిన సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన “ఫిదా” సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. తెలుగులో చక్కగా మాట్లాడగల హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఎక్స్ పోసింగ్ కు దూరంగా ఉండే ఈ హీరోయిన్ తన క్యారెక్టర్ తో అందరి మనసుల్ని దోచుకుంది. తెలుగులో సాయి పల్లవి ని లేడీ పవర్‌స్టార్‌ అని ఫ్యాన్స్ పిలుస్తారు.

అయితే తెలుగులో లాస్ట్ ఇయర్‌ విరాటపర్వం చేశారు పల్లవి. ఆ తర్వాత మరే సినిమా కూడా ఒప్పుకోలేదు. అయితే ఒక సమాచారం ప్రకారం కారణం ఇలా ఉంది. సాయి పల్లవి ఒక డాక్టర్ అని మనకు తెలుసు. తను పుట్టి పెరిగిన ఊరు కోయంబత్తూర్ లో సాయి పల్లవి సొంత ఖర్చులతో హాస్పిటల్ కట్టిస్తుందని, ఆ పనుల్లో ఉండడం వల్ల ప్రస్తుతం ఆమె ఏ సినిమాను చేయట్లేదని తెలుస్తుంది. హాస్పిటల్ పని పూర్తయ్యాక మళ్ళీ సినిమాలు చేస్తుందని సమాచారం.

చూడ్డానికి న్యాచురల్ గా కనిపించే ఈ నటి, మేకప్‌ విషయంలో కూడా స్పష్టమైన అభిప్రాయాలతో ఉంటారు. ఈమె తనతో తెచ్చుకొనే కాస్మొటిక్స్ , మేకప్ కిట్ లను మాత్రమే వాడుతుంది. ఎందుకంటే “మార్కెట్ లో దొరికే క్రీంలు, పౌడర్ ల ద్వారా ఎప్పుడూ అందం రాదు. అందుకే నేను బ్యూటీ కి సంబంధించిన యాడ్స్ కూడా చెయ్యను. ఎందుకంటే అది ఫేక్ ప్రమోషన్ అవుతుంది” అని అన్నారు.

- Advertisement -

అయితే రీసెంట్ గా సాయి పల్లవి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది. సాయి పల్లవి కి డాన్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డాన్స్ పైన ఇష్టం తోనే తాను తెలుగులో ఢీ షో లో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు లో బాగా డాన్స్ చేసే హీరోయిన్ల పేరు చెప్తే అందులో ముందుగా సాయి పల్లవి పేరే వస్తుంది.

అలాంటిది సాయి పల్లవి తాను డాన్స్ ఎలా నేర్చుకుంది అని ఒక ఇంటర్వ్యూ లో రిపోర్టర్ అడిగారు. దానికి సాయి పల్లవి తానెప్పుడూ పనిగట్టుకుని డ్యాన్సులు నేర్చుకోలేదని, మాధురీదీక్షిత్‌, ఐశ్వర్యారాయ్‌ డ్యాన్సులు చూస్తూ పెరిగానని చెప్పింది. వీళ్ళు చేసిన “దేవ్ దాస్” సినిమా లోని “డోలా రే డోలా పాట” చాలా ఇష్టం అని చెప్పారు. అంతే కాదు ఆ పాటకు నిద్రలో లేపి డాన్స్ చేయమన్నసింగల్ టేక్ లో చేస్తానని చెప్పింది. డ్యాన్స్ మీదున్న ప్యాషన్‌తోనే ఇండస్ట్రీలో ఇంత దూరం రాగలిగానని చెప్పింది. ప్రస్తుతం శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేస్తున్న సాయిపల్లవి తెలుగులో అయితే ఇంకా ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updatesGossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు